Srisailam Brahmotsavam : మ‌ల్ల‌న్న కోసం పోటెత్తిన భ‌క్త‌జనం

భారీ ఎత్తున త‌ర‌లి వ‌స్తున్న భ‌క్తులు

Srisailam Brahmotsavam : శ్రీ‌శైలం భ‌క్తుల‌తో పోటెత్తుతోంది. శైవ క్షేత్రాల‌లో ఒక‌టిగా పేరొందింది ఈ పుణ్య క్షేత్రం. మ‌హా శివ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. భారీ ఎత్తున ఉత్స‌వాలు కొన‌సాగుతున్నాయి.

సుదూర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున త‌ర‌లి వస్తున్నారు. తండోప తండాలుగా త‌ర‌లి వ‌స్తున్న భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఆల‌య క‌మిటీ ఏర్పాట్లు చేసింది.

శ్రీ‌శైలంలో చండీశ్వ‌ర పూజ‌, మండ‌పారాధ‌న‌, క‌ల‌శ అర్చ‌న‌, శివ పంచాక్ష‌రీ జ‌పానుష్టాలు, రుద్ర పారాయ‌ణాలు శాస్త్రోక్తంగా చేప‌ట్టారు. ఉత్స‌వాల‌లో భాగంగా మ‌ల్లికార్జున స్వామి, అమ్మ వార్ల‌ను ప్ర‌త్యేకంగా అలంక‌రించారు.

భృంగి వాహ‌నంపై ఊరేగించారు. స్వామి, అమ్మ వార్ల‌ను ద‌ర్శించు కునేందుకు భ‌క్తులు పోటీ ప‌డ్డారు. వీధుల్లో గ్రామోత్స‌వం నిర్వ‌హించారు.

ఉత్స‌వాల‌లో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి జాన‌ప‌దాలు, కోలాటాలు, వేష ధార‌ణ‌లు, జాంబ్ ప‌థ‌క్ , గౌర‌వ నృత్యం, బుట్ట బొమ్మ‌లు, బీర‌ప్ప‌డోలు, నంది కోల సేవ‌, ఢ‌మ‌రుకం, వివిధ విన్యాసాలు.

అంతే కాకుండా మంత్ర పుష్పంతో పాటు స్వామి, అమ్మ వార్ల‌కు ఆస్థాన సేవ చేప‌ట్టారు. ఇవాళ మూడో రోజు ఉద‌యం శాస్త్రోక్తంగా పూజ‌లు చేప‌ట్టారు. సాయంత్రం హంస వాహ‌న సేవ నిర్వ‌హించ‌నున్నారు.

ఇదిలా ఉండ‌గా బెజ‌వాడ ఇంద్ర‌కీలాద్రి స్వామి అమ్మ వార్ల త‌ర‌పున ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్నారు. శైవ మ‌హా పుణ్య‌క్షేత్రానికి తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ , క‌ర్ణాట‌, మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భ‌క్తులు (Srisailam Brahmotsavam)త‌ర‌లి వ‌చ్చారు.

పాతాళ‌గంగ‌లో ప‌విత్ర స్నానాలు చేసేందుకు పోటీ ప‌డ్డారు. ఆల‌యంలో క్యూ లైన్లు నిండి పోయాయి. ఆర్జిత సేవ‌లు ర‌ద్దు చేశారు. ఉచితంగా నీరు, మ‌జ్జిగ అంద‌జేస్తున్న‌ట్లు ఈవో వెల్ల‌డించారు. న‌డ‌క దారిలో వ‌చ్చే వారికి అన్న‌దానం చేస్తున్నారు.

Also Read : ఆన్ లైన్ లో ప్రత్యేక ద‌ర్శ‌నం టికెట్లు

Leave A Reply

Your Email Id will not be published!