Ukraine Attack : నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతోంది రష్యా, ఉక్రెయిన్ల మధ్య. ఇప్పటికే ఇవాళ రష్యా చీఫ్ పుతిన్ యుద్దం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించగానే దళాల దాడులు, బాంబుల మోతతో దద్దరిల్లాయి.
ఓ వైపు ఐక్య రాజ్య సమితితో పాటు అమెరికా సైతం రష్యాను హెచ్చరించింది. ఆపై ఆర్థిక ఆంక్షలు సైతం విధించింది. అయినా పుతిన్ ఒప్పుకోలేదు. ముందుకే సాగుతామని ప్రకటించారు.
తాను చెప్పినట్లుగానే ఉక్రెయిన్ పై ప్రత్యక్ష దాడికి దిగారు. ఇప్పటికే ఎయిర్ పోర్ట్ తో సహా 11 నగరాలను రష్యా దళాలు చేజిక్కించుకున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఉక్రెయిన్ సైతం(Ukraine Attack )తల వంచేందుకు ఇష్ట పడడం లేదు. రష్యా దాడులతో అప్రమత్తమైంది. ఎదురు దాడి ప్రారంభించింది. రష్యాకు ధీటుగా జవాబు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.
కీలక ప్రాంతాలలో పట్టు కోసం ప్రయత్నం చేస్తున్నాయి ఉక్రెయిన్ దళాలు(Ukraine Attack ). ఇదిలా ఉండగా ఈ యుద్దంలో రష్యాకు చెందిన ఫైటర్ జెట్ ను తమ బలగాలు కూల్చి వేశాయని తెలిపింది.
ఇందులో 5 విమానాలు, హెలికాప్టర్ ను ధ్వంసం చేశామని స్పష్టం చేసింది ఉక్రెయిన్. అయితే యుద్దం కొనసాగుతుండడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరింది.
30 రోజుల పాటు దేశంలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు ప్రకటించారు ఉక్రెయిన్ ప్రెసిడెంట్. దీనిని పూర్తిగా ఖండించారు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ.
శాంతి కోరుకునే ప్రాంతాలపై దాడులకు దిగడం మంచిది కాదని సూచించాడు. యుద్దాన్ని ఆపాల్సిన బాధ్యత ఐరాస పై ఉందన్నారు.
Also Read : ఇమ్రాన్ టూర్ పై అమెరికా కామెంట్