Boris Johnson ; బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ సంచలన కామెంట్స్ చేశాడు. ఉక్రెయిన్ పై రష్యా ఏకపక్ష దాడులను తప్పు పట్టాడు. పవర్ కొంత కాలం మాత్రమే ఉంటుందని ఇది మంచి పద్దతి కాదన్నారు.
ఆయన రష్యా చీఫ్ పుతిన్ పై నిప్పులు చెరిగారు. రాజకీయంగా, దౌత్య పరంగా, ఆర్థికంగా, సైనిక పరంగా దాడులు చేయడాన్ని తప్పు పట్టారు. ఇది పూర్తిగా అనాగరిక చర్యగా అభివర్ణించారు పీఎం.
రష్యా దాడిని నిరసిస్తూ ఇవాళ యూకే సర్కార్ అత్యవసర సమావేశం నిర్వహించింది. శాంతి, సామరస్యం ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయని యుద్దం వల్ల కాదని స్పష్టం చేశారు జాన్సన్.
ఉక్రెయిన్ పై ఏకపక్ష దాడులను యావత్ ప్రపంచం మొత్తం ఈసడించు కుంటోందని తెలిపారు. దీనిని తమ దేశం పూర్తిగా ఖండిస్తోందని చెప్పారు బోరిస్.
ఇలా దాడులు చేసుకుంటూ పోతే ప్రపంచంలో ఏ దేశం సురక్షితంగా ఉండదన్నారు. ఇలాగేనా వ్యవహరించేది అని ప్రశ్నించారు. ఐక్య రాజ్య సమితి జనరల్ సెక్రటరీ సైతం తీవ్రంగా తప్పు పట్టారు.
వెంటనే దాడులను ఆపాలని కోరారు. ఇదిలా ఉండగా తాము ఊహించిందే రష్యా చేసి చూపించిందన్నారు బోరిస్ జాన్సన్(Boris Johnson). తమ హెచ్చరికలను ఏ మాత్రం ఖాతరు చేయలేదన్నారు.
కానీ ఉక్రెయిన్ కు తాము అండగా ఉంటామని స్పష్టం చేయడం విశేషం. ఇంకో వైపు నాటో చీఫ్ మాత్రం తాము దళాలను పంపించడం లేదన్నారు.
ఇదే సమయంలో ఉక్రెయిన్ దాడుల దెబ్బకు విల విల లాడుతోంది. ఏం జరుగుతుందో తెలియక నానా తంటాలు పడుతున్నారు.
Also Read : ఆగని యుద్దం మనుగడ కోసం పోరాటం