Modi : ఉక్రెయిన్ పై రష్యా ఏకపక్ష దాడిని తీవ్రంగా ఖండించింది భారత దేశం. యుద్దం వల్ల మారణ హోమం తప్ప ఇంకేమీ మిగలదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు చేసిన ప్రసంగం ప్రపంచాన్ని విస్తు పోయేలా చేసింది.
ప్రత్యేకించి ఆయన కదన రంగంలోకి దూకాడు. ఓడి పోయినా పోరాటం ఆపనంటూ స్పష్టం చేశాడు. తాము యుద్దాన్ని కోరు కోవడం లేదని కావాలని రష్యా దాడికి దిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ సమయంలో ఉక్రెయిన్ రాయబారి రష్యా చీఫ్ పుతిన్ తో మాట్లాడాలని కోరారు. రష్యా దాడుల నేపథ్యంలో భారత్ పై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పటికే స్టాక్ మార్కెట్ వెల వెల బోతోంది.
కోట్లాది రూపాయలు కోల్పోయారు. ఈ సమయంలో భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi)రాత్రి 9.30 గంటల ప్రాంతంలో పుతిన్ తో మాట్లాడారు. వీరిద్దరి మధ్య 15 నిమిషాలకు పైగా సంభాషణ సాగింది.
ఈ సందర్భంగా యుద్దం వెంటనే ఆపాలని, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని నాటో ద్వారా పరిష్కరించు కోవాలని సూచించారు. భారతీయులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు.
దౌత్య పరమైన చర్చలు, సంభాషణల మార్గానికి తిరిగి రావడానికి అన్ని వైపులా నుంచి కృషి జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచం శాంతి ని కోరుకుంటుంది తప్ప యుద్దం కాదని స్పష్టం చేశారు.
భారత దేశం ఎప్పుడూ ఇలాంటి ఘటనలను ప్రోత్సహించదని తెలిపారు. రష్యా, నాటో సమూహం మధ్‌య విభేదాలు నిజాయితీతో కూడిన చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం కోరింది.
Also Read : యూపీలో యోగి ఇక ఇంటికే