Ukraine President : రష్యా ఏకపక్ష దాడి కొనసాగుతుండడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ(Ukraine President ). ప్రస్తుతం మేం ఒంటరిగా మిగిలి పోయాం.
అన్ని వైపుల నుంచి సాయం ఆగి పోయింది. అయినా మేం ఎప్పుడూ ముందుకే సాగుతాం. పోరాటం మాత్రం ఆపే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు జెలెన్స్కీ(Ukraine President ). మాతో కలిసి పోరాడేందుకు ఏ ఒక్కరు ముందుకు రాక పోవడం దారుణమన్నారు.
ఇవాళ మా మీద దాడి జరిగింది. రేపు ఇంకొకరి మీద దండయాత్ర కొనసాగుతుంది. దీనికి ఇప్పుడే పుల్ స్టాప్ పెట్టక పోతే ప్రపంచానికి ప్రమాదమని తెలుసు కోవాలని స్పష్టం చేశారు.
ఆయన సైనికులతో కలిసి యుద్దంలో పాల్గొంటున్నారు. బహుషా ఇప్పుడున్న ప్రపంచంలో ఇదే మొదటి సారి అనుకోవచ్చు. ఒక దేశాధినేత యుద్దంలో పాల్గొనడం.
తాను సైతం దేశం కోసం సమిధనవుతానని ప్రకటించడం. ఇలాంటి నాయకులే ఈ ప్రపంచానికి కావాలి. యుద్దం కావాలని ఎవరూ కోరుకోరు.
కానీ రష్యా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు..తన సత్తా ఏపాటిదో తెలియ చెప్పేందుకు మాత్రమే ఉక్రెయిన్ పై ప్రత్యక్ష యుద్దానికి దిగింది. ఓ వైపు యుద్దం కొనసాగుతుండగా వోలోడిమిర్ జెలెన్స్కీ దేశాన్ని ఉద్దేశించి వీడియో సందేశం ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమతో పాటు పోరాడేందుకు ఎవరు సిద్దంగా ఉన్నారంటూ ప్రశ్నించారు. తాము భయపడే ప్రసక్తి లేదని ముందుకే సాగుతామని, పోరాటం మాత్రం ఆప బోమంటూ హెచ్చరించారు.
పెద్ద ఎత్తున సైనికులే కాదు సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారంటూ వాపోయారు.
Also Read : చావు కబురు చల్లగా చెప్పిన నాటో