Jin Ping Putin : అంతర్జాతీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు అమెరికా ఉక్రెయిన్ పై దాడుల్ని ఖండిస్తుండగా ఇంకో వైపు రష్యా ఎక్కడా తగ్గడం లేదు. బాంబుల మోత మోగిస్తూనే ఉంది. సైన్యాలు కదం తొక్కుతున్నాయి.
క్షిపణలు ప్రయోగిస్తున్నారు. ఇంకో వైపు ఆర్మీ లొంగి పోతే తాము చర్చలకు సిద్దంగా ఉన్నామని రష్యా ప్రకటించింది. అయినా యుద్దాన్ని మాత్రం ఆపడం లేదు.
ఇది వార్ కాదని కేవలం సైనిక చర్య మాత్రమేనని ఇప్పటికే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు పుతిన్. ఇదిలా ఉండగా 20 వేల మందికి పైగా విద్యార్థులు ఉక్రెయిన్ లో ఇరుక్కున్నారు.
ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక లబోదిబోమంటున్నారు. ఇదే సమయంలో అమెరికా, నాటో, ఇతర దేశాలు గనుక తమపై ఆంక్షలు విధిస్తే ఏకంగా అంతర్జాతీయ స్పేస్ కేంద్రాన్ని కూల్చి వేస్తామని ప్రకటించారు రష్యా స్పేస్ చీఫ్.
ఇదిలా ఉండగా తాను పుతిన్ తో చర్చలు జరిపేందుకు సిద్దంగా ఉన్నానని వెల్లడించారు ఉక్రెయిన్ చీఫ్. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తిగా పరువు పోగొట్టుకున్నది మాత్రం అమెరికానే.
తానే కావాలని ప్రోత్సహించింది. చివరకు చావు దెబ్బ తింది. రష్యాపై యుద్దానికి సై అన్నది. కానీ రష్యా తన జోలికి వస్తే తాట తీస్తానని హెచ్చరించింది.
ఈ సమయంలో మరో మిత్ర దేశం చైనా అనూహ్యంగా రంగంలోకి ఎంటరైంది. వెంటనే యుద్దం ఆపాలని అవసరమైతే మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం చైనా చీఫ్ ఫోన్(Jin Ping Putin) చేయడంతో అమెరికా చిక్కుల్లో పడింది.
Also Read : నన్ను చంపడమే రష్యా టార్గెట్