Hema Malini : యుద్దాన్ని ఆపేందుకు మోదీ ప్ర‌య‌త్నం

స్ప‌ష్టం చేసిన ఎంపీ హేమ మాలిని

Hema Malini : ప్ర‌ముఖ న‌టి, భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ హేమ‌మాలిని (Hema Malini)ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య నెల‌కొన్న యుద్దాన్ని ఆపేందుకు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ చెప్పింది.

యూపీలో సీఎం యోగి, దేశంలో పీఎం మోదీ ఇద్ద‌రూ అద్భుత‌మైన నాయ‌కులు అని కొనియాడారు. యూపీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఇవాళ హేమ‌మాలిని మాట్లాడారు.

ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌పంచ వ్యాప్తంగా పెద్ద‌న్న అమెరికా సైతం మోదీని జోక్యం చేసుకోవాల‌ని కోరుతున్నార‌ని ఇది మ‌న దేశ నాయ‌కుడి అద్భుత‌మైన పరిపాల‌నా ద‌క్ష‌త‌కు నిద‌ర్శ‌నం అన్నారు.

ఇప్ప‌టికే ఉక్రెయిన్ రాయ‌బారి సైతం పీఎంకు విన్న‌వించార‌ని తెలిపారు. యావ‌త్ దేశం మోదీని చూసి ఆశ్చ‌ర్యానికి లోన‌వుతోంద‌న్నారు. ప్ర‌పంచం సైతం విస్తు పోతోంద‌న్నారు.

ఇప్పుడు కూడా ఉక్రెయిన్ ర‌ష్యా యుద్దంలో అడ్డుకునే ప్ర‌య‌త్నంలో పాలు పంచుకోవాల‌ని కోర‌డం ప్ర‌శంస‌నీయ‌మ‌ని అన్నారు. త‌మ మోదీజీని ప్ర‌పంచ నాయ‌కుడిగా ప‌రిగ‌ణించ‌డం త‌మ‌కంద‌రికీ గ‌ర్వ కార‌ణంగాఉంద‌న్నారు హేమ‌మాలిని(Hema Malini).

గ‌త కొన్ని నెల‌లుగా సోష‌ల్ మీడియా సైతం మోదీని మోస్ట్ ప‌వ‌ర్ లీడ‌ర్ గా పేర్కొంటోంద‌ని తెలిపారు. ఇదిలా ఉండ‌గా దేశం కోసం ర‌ష్యా ద‌ళాల‌ను వెంట‌నే ఉప‌సంహ‌రించు కోవాల‌ని మోదీ ఫోన్ లో పుతిన్ ను కోరారు.

త‌క్ష‌ణ‌మే దాడుల‌ను ఆపాల‌ని సూచించారు. అంతే కాకుండా భార‌తీయుల‌ను సుర‌క్షితంగా తీసుకు వ‌చ్చేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టార‌ని అన్నారు హేమ మాలిని.

సుస్థిరమైన పాల‌న ఒక్క బీజేపీకే సాధ్య‌మ‌ని ఆమె అన్నారు. ఈ ఎన్నిక‌ల్లో తాము త‌ప్ప‌క గెలుస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

Also Read : ఈ యుద్దం ప్ర‌పంచానికి ప్ర‌మాదం

Leave A Reply

Your Email Id will not be published!