Srisailam Brahmotsavam : వైభ‌వోపేతం మ‌ల్ల‌న్న మ‌హోత్స‌వం

పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చిన భ‌క్తులు

Srisailam Brahmotsavam : న‌ల్ల‌మ‌ల‌లో కొలువు తీరిన శ్రీ‌శైలం భ‌క్తుల‌తో పోటెత్తుతోంది. ఎటు చూసినా శివ శివ అంటూ నినాదాల‌తో ద‌ద్ద‌రిల్లుతోంది. మ‌హా శివ‌రాత్రి ఉత్స‌వాలు వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి.

ఉత్స‌వాల‌లో భాగంగా తండోప తండాలుగా త‌ర‌లి వ‌స్తూనే ఉన్నారు. రహ‌దారుల‌న్నీ భ‌క్తుల‌తో నిండి పోయాయి. శివ స్వాములు కాలి న‌డ‌క‌న భ్ర‌మ‌రాంబిక‌..మ‌ల్లికార్జున స్వామి వార్ల ద‌ర్శ‌నం(Srisailam Brahmotsavam) కోసం బారులు తీరారు.

వంద‌ల కిలోమీట‌ర్ల పొడ‌వునా భ‌క్తులు ఇబ్బందులు ప‌డ‌కుండా నీళ్లు, మ‌జ్జిగ‌, అన్న ప్ర‌సాదాల‌ను అంద‌జేస్తున్నారు. అటు ఏపీ, ఇటు తెలంగాణ ప్ర‌భుత్వాలు భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాయి.

ఇంకో వైపు ప్ర‌త్యేకంగా బ‌స్సుల‌ను వేసింది టీఎస్ఆర్టీసీ. ప్ర‌త్యేక పూజ‌లు కొన‌సాగుతున్నాయి. మంగ‌ళ వాయిద్యాలు ఓ వైపు మంత్రోశ్చార‌ణ‌లు ఇంకో వైపు స్వామి, అమ్మ వార్ల‌కు పూజ‌లు నిర్వ‌హించారు.

శ్రీశైలం ఆల‌యం ఇప్పుడు స‌ర్వాంగ సుంద‌రంగా ముస్తాబైంది. ఇలా త‌యారు కావ‌డానికి కార‌ణం గ‌తంలో ఇక్క‌డ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ గా ప‌ని చేసిన భ‌ర‌త్ గుప్తా.

ఈ యంగ్ అండ్ డైన‌మిక్ ఆఫీస‌ర్ ప్ర‌య‌త్నంతో ఇప్పుడు శ్రీ‌శైలం ప్ర‌సిద్ద పుణ్య‌క్షేత్రంగా(Srisailam Brahmotsavam) మ‌రింత శోభాయ‌మానంగా అల‌రారుతోంది. క‌ళాకారుల ప్ర‌ద‌ర్శ‌న‌లు కూడా ఆక‌ట్టుకున్నాయి.

శివ నామ స్మ‌ర‌ణ‌తో శ్రీ‌గిరులు నిండి పోయాయి. కృష్ణా న‌దిలో స్నానాలు చేసేందుకు పోటెత్తారు. ముడుపులు చెల్లించేందుకు భ‌క్తులు పోటీ ప‌డ్డారు.

పాతాళ‌గంగ వ‌ద్ద ఎటు చూసినా భ‌క్తుల‌తో నిండి పోయింది. దేవ‌స్థానం ప్ర‌త్యేకంగా అన్న‌దాన భ‌వ‌నంలో భోజ‌న స‌దుపాయాలు ఏర్పాటు చేసింది ఆల‌య క‌మిటీ.

Also Read : తిరుమ‌ల‌లో అంద‌రికీ ఒక‌టే భోజ‌నం

Leave A Reply

Your Email Id will not be published!