TTD : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. కరోనా కారణంగా వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ వార్లను దర్శించు కోలేక పోయారు.
ఇప్పటికే కఠినమైన రూల్స్ విధించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గ దర్శకాలను పాటించాల్సిందేనంటూ స్పష్టం చేసింది.
దీంతో కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా కోవిడ్ నెగటివ్ రిపోర్ట్ 48 గంటల లోపు సమర్పించాలని లేక పోతే దర్శనాలు ఉండదని వెల్లడించింది టీటీడీ(TTD).
ఈ తరుణంలో భక్తులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో సర్వ దర్శనం టోకెన్లు జారీ చేయాలని కోరారు.
చాలా మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన భక్తులు ఇంటర్నెట్ కనెక్టివిటీ లేక పోవడం,ఉన్నా వారికి నమోదు చేసుకునే సౌలభ్యం లేక పోవడంతో టీటీడీ(TTD) ఆఫ్ లైన్ లో సైతం సర్వ దర్శనం టోకెన్లను జారీ చేసేందుకు నిర్ణయించింది.
అయితే ఊహించని రీతిలో భక్తులు పోటీ పడ్డారు. అంతే కాకుండా దేవుడి దర్శనం చేసుకోవాలంటే వైకుంఠానికి పోయినంత పని అవుతోందంటూ వాపోతున్నారు. వీవీఐపీల పేరుతో తమను పక్కన పెట్టడాన్ని వారు నిలదీస్తున్నారు.
దీంతో భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది.సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
శుక్ర, శని, ఆది వారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సర్వ దర్శనం భక్తులకు రోజుకు 30 వేల టోకెన్లు బుక్ చేసినట్లు టీటీడీ తెలిపింది.
Also Read : ప్రమాదంలో ప్రజాస్వామ్యం