Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో భారత ప్రభుత్వం అనుసరించిన విధానం చేటు తెచ్చే విధంగా ఉంది తప్ప మేలు చేకూర్చేలా లేదన్నారు.
ఈ విషయంలో మోదీ ఫెయిల్ అయ్యారంటూ మండిపడ్డారు. ఇదే సమయంలో పాకిస్తాన్ పీఎం ఇమ్రాన్ ఖాన్, చైనా చీఫ్ జిన్ పింగ్ రష్యాకు మద్దతు పలికినట్లు వచ్చిన వార్తలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
మోదీ వ్యూహాత్మిక తప్పిదాల కారణంగా భారీ ఎత్తున మూల్యం చెల్లించు కోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఇదిలా ఉండగా మోదీ ప్రభత్వ విదేశాంగ విధానాన్ని తొలి నుంచీ తప్పు పడుతూ వస్తున్నారు రాహుల్ గాంధీ(Rahul Gandhi ).
విచిత్రం ఏమిటంటే మోదీ దెబ్బకు చైనా, పాకిస్తాన్ లు ఒక్కటయ్యేలా ఉందని ఆరోపించారు. దేశం నలుమూలలా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని ఇది ఎంత మాత్రం క్షమించ లేమన్నారు.
రాబోయే రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉందంటూ పేర్కొన్నారు. భారత్ ఎత్తుగడలు, వ్యూహాలు అత్యంత చులకన కలిగించేలా ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు.
మోదీ నిర్వాకం కారణంగా భారత్ కు ప్రమాదం తప్ప ప్రయోజనం లేదని తీవ్ర ఆగ్రహం వ్యకతం చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi ). పవర్ ను ఎంజాయ్ చేస్తూ ప్రచారంపై ఫోకస్ పెడుతున్న మోదీ దేశం గురించి పట్టించు కోవడం లేదని సీరియస్ అయ్యారు.
పవర్ ను ఎంజాయ్ చేస్తూ ప్రచారంపై ఫోకస్ పెడుతున్న మోదీ దేశం గురించి పట్టించు కోవడం లేదని సీరియస్ అయ్యారు.
Also Read : యుద్దాన్ని ఆపేందుకు మోదీ ప్రయత్నం