European Union : ఉక్రెయిన్ పై రష్యా ప్రెసిడెంట్ ఆగ్రహం ఇంకా చల్లారలేదు. రాజ్య కాంక్ష ఎంత బలీయంగా ఉంటుందో ఆయనను చూస్తే తెలుస్తుంది. పైకి ప్రశాంతంగా కనిపించినా మొత్తం నర నరాన ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది.
ఆర్మీ లొంగి పోతే తాము చర్చలకు సిద్దమేనంటూ ప్రకటించింది రష్యా. కానీ ఆ మాటలు నీటి మూటలేనని తేలిపింది. కొద్ది నిమిషాల్లోనే యూ టర్న్ తీసుకున్నారు చీఫ్ . పూర్తిగా ఉక్రెయిన్ స్వాధీనం వచ్చేంత వరకు యుద్దం ఆప వద్దంటూ ఆర్డర్ పాస్ చేశాడు పుతిన్.
దీంతో ఓ వైపు ఆర్మీ దళాలు ఇంకో వైపు మిస్సైళ్లు, బాంబుల మోతతో ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. రాజధానిని కైవసం చేసుకునేందుకు రెడీ అయ్యాయి.
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రదర్శించినట్లు రష్యా ఉక్రెయిన్ ను టార్గెట్ చేయడం , దాడులకు పాల్పడడాన్ని నాటో, ఐక్య రాజ్య సమితి, అమెరికా, బ్రిటన్, ఫ్రెంచ్ దేశాలు గగ్గోలు పెట్టాయి.
ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించాయి. కానీ ఆ వార్నింగ్ లను పక్కన పెట్టాడు పుతిన్. ఎన్నైనా ప్రకటించండి కానీ తాను మాత్రం తగ్గేదే లేదని ప్రకటించాడు పుతిన్. ఆసియా పసిఫిక్ దేశాలు(European Union) కఠిన ఆంక్షలు విధించాయి.
తాజాగా పుతిన్ కు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది యూరోపియన్ యూనియన్ – ఈయూ(European Union). పుతిన్, రష్యా విదేశాంగ శాఖ మంత్రి లావ్రోవ్ ఆస్తులను ఫ్రీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఉక్రెయిన్ తో చర్చించేందుకు బెలారస్ రాజధాని మిన్ స్క్ కు ఓ టీంను పంపనున్నట్లు పుతిన్ తెలిపారు.
Also Read : లొంగిపోతే చర్చలకు సిద్దం – రష్యా