Chopper Crash : తెలంగాణలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా పెద్దపూర మండలం రామన్నగూడెం తండా వద్ద ఇవాళ చాపర్(Chopper Crash) కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో పైలట్ తో పాటు ట్రైనీ పైలట్ మృతి చెందారు.
పైలట్ల శరీర భాగాలు ముద్దలు ముద్దలుగా పడి పోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద ఘటన స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా శిక్షణ హెలికాప్టర్ కూలిన విషయాన్ని ఎయిర్ ఫోర్స్ సమాచారం అందించారు. చాపర్ కూలిన (Chopper Crash)సమయంలో భారీ శబ్దం వినిపించిందని రైతులు, కూలీలు దర్యాప్తు బృందానికి అందించారు.
కాగా కృష్ణా నది పై నాగార్జున సాగర్ డ్యామ్ కు సమీపం లోని పెద్దవూర బ్లాక్ తుంగతుర్తి గ్రామ వద్ద చోటు చేసుకుంది. హెలికాప్టర్ ఘటనలో మృత దేహాలను గుర్తించారు. పోలీసులు, వైద్య బృందాలు అక్కడికి చేరుకున్నాయి.
కూలి పోయిన ఛాపర్ శిక్షణలో ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదు. చుట్టు పక్కల ప్రాంతాల వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ప్రస్తుతం ఛాపర్ కూలిన ఘటనలో దుర్మరణం చెందిన పైలట్ల కుటుంబాలలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది.
మొత్తం మీద ఘటన ఎందుకు జరిగిందనే దానిపై క్లారిటీ రాలేదు. దర్యాప్తు బృందం ఘటనకు గల కారణాల గురించి నివేదిక సమర్పించాక ఏం జరిగిందనేది తెలుస్తుంది.
Also Read : దేశం కోసం రక్తం ధారపోస్తా