Ukraine President : ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఉక్రెయిన్ పై రష్యా దాడి చేయడాన్ని ఖండిస్తోంది. ఇది ఎంత మాత్రం మంచి ద్దతి కాదంటూ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా రష్యా నిరాంటంకంగా దాడులకు తెగ బడుతోంది.
ఎడ తెరిపి లేకుండా బాంబుల మోత మోగిస్తోంది. మిస్సైళ్లు జడి వానలా కురుస్తున్నాయి. ఇరు దేశాలు తగ్గే దే లే అంటూ నిప్పులు చెరుగుతున్నాయి.
కాగా పుతిన్ సైన్యం ముందు ఉక్రెయిన్ చీఫ్ గెలెన్స్కీ(Ukraine President )బలం దిగ దుడుపే. తాము లొంగి పోయే ప్రసక్తి లేదంటూ ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుతూ యుద్దం ఆటను మరింత రక్తి కట్టిస్తున్నారు.
ఒకవేళ ఆర్మీ గనుక లొంగి పోతే తాము చర్చలకు సిద్దమంటూ ప్రకటించారు రష్యా చీఫ్ పుతిన్. ఆ గంట సేపటకే మళ్లీ సైన్యాలను మోహరించారు. దాడులకు తెగబడ్డారు.
మిస్సైళ్లను ఉపయోగించారు. పిల్లలను , సామాన్య పౌరులను తాము ముట్టుకోబోమంటూ స్పష్టం చేసినా చివరకు వారిపైనే తన ప్రభావాన్ని చూపించారు.
ఈ దాడుల్లో 300 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అంచనా. అంతే కాకుండా 1, 50, 000 మంది భయంతో పొట్ట చేత పట్టుకుని ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లి పోయారు.
ఇంకో వైపు రష్యా తాము చర్చలకు సిద్దమంటూనే మరో వైపు దాడులను కొనసాగిస్తోంది. కాగా ఉక్రెయిన్ (Ukraine President )తో చర్చల కోసం బెలారస్ లోని గోమెల్ కు తాము ఓ టీంను పంపిస్తామంటూ ఓ ప్రకటన చేసింది రష్యా.
అంతర్జాతీయ సమాజం మొత్తం రష్యాను తప్పు పట్టడంతో తన తప్పేమీ లేదని చెప్పేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read : యుద్దం చేస్తా చావును హత్తుకుంటా