Prashant Kishor : తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర సమితి పూర్తిగా ఫోకస్ పెట్టారు.
భారత దేశ రాజకీయాలను తన వ్యూహాలతో శాసిస్తూ వస్తున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor)సీఎం కేసీఆర్ తో ములాఖత్ అయ్యారు. గత కొంత కాలంగా కేసీఆర్ తన వ్యూహాన్ని మార్చారు.
దేశ రాజకీయాలలో ఫోకస్ పెట్టాలని చూస్తున్నారు. తాజాగా ప్రశాంత్ కిషోర్ ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో ములాఖత్ అయ్యారు. ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తో కలిసి మల్లన్న సాగర్ ప్రాజెక్టు, గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను సందర్శించారు ప్రశాంత్ కిషోర్.
అనంతరం కేసీఆర్ ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. రెండు రోజుల పాటు వీరిద్దరూ వివిధ అంశాలు, జాతీయ, రాష్ట్ర రాజకీయలపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు.
గతంలో గుజరాత్ మోడల్ అంటూ దేశ వ్యాప్తంగా మోదీని ఎక్కువగా హైలెట్ చేస్తూ ప్రచారం చేపట్టారు.ఇదే తరహా మోడల్ , నినాదంతో ఇక దేశమంతటా తెలంగాణ మోడల్ ను ముందుకు తీసుకు వెళ్లాలని పీకే నిర్ణయించినట్లు సమాచారం.
దేశానికి ఆదర్శం తెలంగాణ రాష్ట్రం అంటూ దూసుకెళ్ల నున్నారు. రాష్ట్ర సర్కార్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ మోడల్ పేరుతో ముందుకు వెళ్లాలని పీకే, పీఆర్, కేసీఆర్ ముందుకు వెళ్లేందుకు డిసైడ్ అయ్యారని సమాచారం.
గతంలో పీకే, కేసీఆర్ తో జత కడతారని జరిగిన ప్రచారానికి ఊతం ఇస్తూ టీఆర్ఎస్ తో మనోడు జత కట్టాడు. ఇప్పటికే పలు మార్లు పీకే టీం సర్వేలు చేపట్టింది రాష్ట్రంలో . ఆ మేరకు ఆ సర్వే రిపోర్టును కూడా సీఎం వద్ద ఉంచినట్లు సమాచారం.
Also Read : అంతా సమానం ఒకే విధానం