KCR Rakesh Tikait : దేశ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే బీజేపీకి ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు కదులుతున్నారు సీఎం కేసీఆర్.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ను, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో కలిసి దేశ రాజకీయాలపై చర్చించారు. భావ సారూప్యత కలిగిన వ్యక్తులు, పార్టీలు, సంస్థలతో చర్చించేందుకు తాను సిద్దంగా ఉన్నానంటూ ప్రకటించారు సీఎం.
తాజాగా అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది ఢిల్లీలో. ప్రస్తుతం ఢిల్లీ టూర్ లో ఉన్నారు కేసీఆర్. సీఎంను మర్యాద పూర్వకంగా భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్య స్వామి,
భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్(KCR Rakesh Tikait) భేటీ అయ్యారు. ఇద్దరూ దేశంలో ప్రాముఖ్యత కలిగిన నాయకులు. ఒకరు రైతు సంఘం నాయకుడు అయితే మరొకరు జగమెరిగిన డైనమిక్ లీడర్ స్వామి.
ఇవాళ వీరిద్దరూ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పాటు భవిష్యత్ పాలిటిక్స్ కూడా చర్చించారు. కేసీఆర్ తో కలిసి సుబ్రమణ్య స్వామి, రాకేశ్ తికాయత్ భోజనం చేశారు.
బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో జాతీయ స్థాయి కూటమిని ఏర్పాటు చేయాలన్న సత్ సంకల్పంతో ప్రయత్నాలు ప్రారంభించారు కేసీఆర్. వివిధ పార్టీల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు.
ఢిల్లీలోనే ఉన్న సీఎం మరికొందరు పార్టీ నాయకులు, ఇతర నేతలను కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారు.
Also Read : నవాబ్ మాలిక్ రాజీనామా చేయాల్సిందే