Mamata Banerjee : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) సంచలన వ్యాఖ్యలు చేశారు. తానేమీ పిరికిపంద కానని అలా అనుకుంటే పొరపాటు పడినట్లేనని అన్నారు.
తాను శివంగినని , యోధురాలినని స్పష్టం చేశారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం ఇవాళ వారణాసిలో సమాజ్ వాదీ పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తరపున ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా ప్రసంగించారు మమతా బెనర్జీ. తాను ఎవరికీ భయపడే ప్రసక్తి లేదన్నారు. ఎందరో తనను అంతం చేయాలని చూశారని, ఎన్నో దాడులకు పాల్పడ్డారని కానీ తాను ఒంటరిగా వాటిని ఎదుర్కొని నిలబడ్డానని, తల ఎత్తుకు మీ ముందుకు వచ్చానని చెప్పారు.
తన జీవితంలో బుల్లెట్ దెబ్బలను కూడా చవి చూశానని అన్నారు. కానీ ఎవ్వరి ముందూ తలవంచ లేదని ఆరోపించారు. వారణాసి పర్యటన సమయంలో హిందూ యువ వాహని కార్యకర్తలు తనను అడ్డుకునే ప్రయత్నం చేశారని , అయినా ధైర్యంగా కారు దిగి వారి ముందు నిలిచానని స్పష్టం చేశారు.
వారే పిరికి పందలంటూ సంచలన కామెంట్స్ చేశారు. నిన్నటికి నిన్న ఎయిర్ పోర్ట్ నుంచి వెళుతుంగా కాషాయ కార్యకర్తలు అడ్డుకున్నారు.
కట్టెలతో దాడి చేస్తూ..గో బ్యాంక్ అంటూ హెచ్చరించారు. కానీ తాను ధైర్యంగా నిలబడ్డా. కానీ తర్వాత వాళ్లే వెళ్లి పోయారని ఆరోపించారు.
మమతా బెనర్జీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. ఉన్న ఆస్తులను అమ్మకానికి పెట్టి దేశాన్ని సర్వ నాశనం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.
Also Read : యూపీలో పవర్ లోకి రావడం కష్టమే