YS Jagan : ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అని పేర్కొన్నారు.
ఇదే సమయంలో ప్రాజెక్టుకు సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చేయాలని ఆదేశించారు సీఎం. ప్రాజెక్టు నిర్మాణ పనులతో పాటు పునరావాస కాలనీలను కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కలిసి ఇవాళ సందర్శించారు.
ఇదే సమయంలో క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనుల ప్రగతిని సమీక్షించారు. ఇందుకూరు నిర్వాసితులతో వీరిద్దరూ ముఖాముఖి చేపట్టారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ రెడ్డి మాట్లాడారు. పోలవరం త్వరితగతిన పూర్తయితే సస్య శ్యామలం అవతుందని చెప్పారు.
ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయి పూర్తిగా నిర్వాసితులైన వారందరికీ కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందిస్తుందని స్పష్టం చేశారు సీఎం.
అంతే కాకుండా సాయంతో పాటు జీవనానికి ఇబ్బందులు లేకుండా చేస్తానని అన్నారు. ఇందులో భాగంగా వారికి నిరంతరం జీవనోపాధి కల్పించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామని వెల్లడించారు జగన్ రెడ్డి(YS Jagan).
అంతే కాకుండా గతంలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో రూ. 6.8 లక్షల నుంచి రూ. 10 లక్షలు ఇస్తామని గతంలో చెప్పానని దానిని బేషరతుగా అమలు చేస్తామని ప్రకటించారు మరోసారి.
అయితే దివంగత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ హయాంలో భూ సేకరణలో భాగంగా ఎకరం లక్షన్నరకే ఇచ్చిన వారికి రూ 5 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి.
Also Read : అవగాహన లేనివారు చెప్పిన తీర్పు ఇది