Peshawar Blast : పాకిస్తాన్ లో దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రార్థన చేసుకుంటున్న సమయంలో పెషావర్(Peshawar Blast )లోని మసీదులో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 56 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
200 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఈ దారుణం పెషావర్ లోని కిస్సా ఖ్వానీ బజార్ ప్రాంతంలోని జామియా మసీదులో ప్రార్థనలు చేస్తుండగా పేలుడు సంభవించింది.
ఈ విషయాన్ని రెస్క్యూ అధికారి వెల్లడించారు. అయితే ఈ పేలుడు ఘటనకు బాధ్యులు ఎవరనే దానిపై ఇంకా ప్రకటించ లేదు ఏ గ్రూప్. ఎవరూ ఊహించని రీతిలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
ప్రాథమిక అంచనా మేరకు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మసీదు లోకి ప్రవేశించేందుకు ప్రయత్నం చేశారు. విధుల్లో ఉన్న అధికారులపై కాల్పులు జరిపారు. కాల్పుల ఘటన జరిగాక మసీదులో పేలుడు(Peshawar Blast )సంభవించింది.
సిటీ పోలీస్ ఆఫీసర్ పెషావర్ ఇజాజ్ అహ్వాన్ ఈ విషయం గురించి ధ్రువీకరించారు. ఇప్పటి దాకా 30 మృత దేహాలను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
అయితే గాయపడిన 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. మసీదు ప్రాంతం అంతా హాహాకారాలతో నిండి పోయింది. ఎక్కడ చూసినా శరీరాలు ఛిద్రమై పడి ఉన్నాయి.
తాను కళ్లు తెరిచి చూశాను. ప్రతి చోటా దుమ్ము , శరీరాలు పడి ఉన్నాయని ప్రత్యక్ష సాక్షి షాయన్ హైదర్ వాపోయాడు. ఇదిలా ఉండగా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్. తక్షణ వైద్య సాయం అందించాలని ఆదేశించారు.
Also Read : అమెరికాకు సౌదీ అరేబియా వార్నింగ్