Russia Ukraine War : రియాక్టర్ల ధ్వంసం అణు కేంద్రం స్వాధీనం
నిప్పులు చెరిగిన ఉక్రెయిన్ చీఫ్ జెలెన్స్కీ
https://teluguism.com/saudi-arabia-warning-to-america/Russia Ukraine War : రష్యా విధ్వంసం కొనసాగుతూనే ఉన్నది. బాంబుల దాడులే కాదు మిస్సైల్స్ ను యుద్ద ప్రాతిపదికన ప్రయోగిస్తోంది. యావత్ ప్రపంచం నెత్తి నోరు బాదుకున్నా పట్టించు కోవడం లేదు రష్యా చీఫ్ వ్లాదిమిర్ పుతిన్.
తాజాగా ఉక్రెయిన్ లోని ఐదు రియాక్టర్లను (Russia Ukraine War)ధ్వంసం చేసింది. అంతే కాదు అత్యంత కీలకంగా ఉన్న జపోరిజియా న్యూక్లియర్ విద్యుత్ ప్లాంట్ ను రష్యా స్వాధీనం చేసుకుంది.
ఈ ఆకస్మిక దాడులతో ప్రపంచం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. 1986 సంవత్సంలో చోటు చేసుకున్న దారుణమైన చెర్నోబిల్ ఘటనను ఇంకా ఈ లోకం మరిచి పోలేదు.
ఇదే గనుక పేలితే యూరోపియన్ యూనియన్ దేశాలు భారీగా నష్ట పోతాయి. ఇదిలా ఉండగా ప్లాంటు లో రియాక్టర్లకేమీ కాలేదని అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకటించింది.
దీంతో కొంత ఊపిరి పీల్చుకుంది. అక్కడ కేవలం ట్రైనింగ్ సెంటర్ మాత్రమే ఉందని , అయితే జపోరిజియాలో న్యూక్లియర్ రేడియేషన్ లో(Russia Ukraine War) ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ మారియానో.
ఇదే సమయంలో రష్యా దళాలు దాడి చేసిన ఘటనలో పవర్ ప్లాంట్ సమీపంలో ఉన్న ముగ్గురు ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ముందస్తు హెచ్చరికలు లేకుండానే రష్యా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించాయి ప్రపంచ దేశాలు. మరో వైపు చెర్నో బిల్ విపత్తును గుర్తుకు తెచ్చేలా రష్యా యత్నిస్తోందంటూ ఉక్రెయిన్ చీఫ్ జెలెన్స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : అమెరికాకు సౌదీ అరేబియా వార్నింగ్