UGC : యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ – యూజీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా యూజీసీ కొత్త కోర్సులకు శ్రీకారం చుట్టింది.
అంతే కాకుండా గతంలో ఉన్న కోర్సుల కాల పరిమితిని కూడా తగ్గించింది. ఇప్పటి దాకా ఉన్న మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ – ఎంసీఏ గతంలో మూడు సంవత్సరాలు చదవాల్సి వచ్చేది.
దానిని యూజీసీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఈ కోర్సును రెండేళ్లకు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు యూజీసీ(UGC) నోటిఫికేషన్ దేశ వ్యాప్తంగా జారీ చేసింది.
అంతే కాకుండా బ్యాచ్ లర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ కోర్సు కాల వ్యవధి నాలుగు సంవత్సరాలు ఉంది. దీనిని యూజీసీ నాలుగున్నర ఏళ్లకు పెంచింది.
అంతే కాకుండా బ్యాచ్ లర్ ఆఫ్ ఫ్యాషన టెక్నాలజీ కోర్సును డిగ్రీ స్థాయిలో ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఇంటర్మీడియట్ చదివిన వారు ఈ కోర్సులో చేరేందుకు అవకాశం కల్పించింది.
ఈ కోర్సుతో పాటు మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సును రెండేళ్ల వ్యవధిలో ఉండేలా కొత్తగా ప్రవేశ పెట్టింది యూజీసీ. మరో వైపు కొత్తగా అర్బన్ డిజైన్ లో నాలుగేళ్ల బ్యాచ్ లర్ డిగ్రీ కోర్సు తీసుకు వచ్చింది.
రెండేళ్ల మాస్టర్ డిగ్రీలను ప్రవేశ పెట్టింది యూజీసీ. బ్యాచ్ లర్ ఆఫ్ స్పోర్ట్స్ ను మూడేళ్ల కాల వ్యవధిలో, మాస్టర్ ఆఫ్ స్పోర్టస్ ను రెండేళ్ల కాల వ్యవధి ఉండేలా కొత్త కోర్సును తీసుకు వచ్చింది యూజీసీ. స్పోర్ట్స్ సైన్స్ లో కొత్త కోర్సులకు పర్మిషన్ ఇచ్చింది.
Also Read : చెన్నై నగరం దళిత మహిళకు పట్టం