Kohli Shane Warne : వార్న్ లేడంటే న‌మ్మ‌లేక పోతున్నా

కోహ్లీ..రోహిత్..రాహుల్ ద్ర‌విడ్

Kohli Shane Warne : ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గ‌జం షేన్ వార్న్ హ‌ఠాన్మ‌ర‌ణంతో యావ‌త్ క్రీడా లోకం శోక సంద్రంలో మునిగి పోయింది. 52 ఏళ్ల‌కే త‌నువు చాలించిన ఈ దిగ్గ‌జ యోధుడిని త‌లుచుకుని క్రీడాభిమానులు, ఆట‌గాళ్లు తీవ్ర విషాదానికి లోన‌వుతున్నారు.

భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి – బీసీసీఐ , రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో పాటు వంద‌లాది మంది క్రికెట‌ర్లు వార్న్(Kohli Shane Warne ) ను త‌లుచుకుని బాధ ప‌డుతున్నారు. సోష‌ల్ మీడియా మొత్తం వార్న్ తో నిండి పోయింది.

బౌల‌ర్ గా త‌న‌కంటూ ఓ ఇమేజ్ ను స్వంతం చేసుకున్న వార్న్(Kohli Shane Warne ) ను తాము మ‌రిచి పోలేక పోతున్నామ‌ని పేర్కొన్నారు. టీమిండియా క్రికెట‌ర్లు సైతం అత‌డితో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

తాజాగా శ్రీ‌లంక‌తో మొహాలీలో జ‌రుగుతున్న టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు బీసీసీఐ ప్ర‌త్యేక సెష‌న్ చేప‌ట్టింది. ఇందులో భార‌త్, శ్రీ‌లంక ఆట‌గాళ్లు నివాళులు అర్పించారు.

ఈ సంద‌ర్భంగా భార‌త మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, కోచ్ రాహుల్ ద్ర‌విడ్ స‌హా మిగ‌తా వాళ్లు సైతం సంతాపం వ్య‌క్తం చేశారు. కోహ్లీ పూర్తిగా అదుపు త‌ప్పాడు. తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యాడు.

రాత్రి షేన్ వార్న్ లేడ‌న్న వార్త తెలిసి విస్తు పోయా. త‌న‌కు న‌మ్మ బుద్ది కాలేద‌న్నాడు. వార్న్ చ‌ని పోలేద‌ని ఇప్ప‌టికీ న‌మ్ముతున్నాన‌ని పేర్కొన్నాడు. జీవితంలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌ద‌న్నాడు.

క్రికెట్ బంతిని ఆయ‌న కంటే బాగా ఎవ‌రూ ప్ర‌యోగించ లేరన్నాడు రోహిత్ శ‌ర్మ‌. మా త‌రంలో షేన్ వార్న్ ఓ అద్భుత‌మైన ఆటగాడు అంటూ కొనియాడాడు హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్.

Also Read : జ‌డేజా షాన్ దార్ శ్రీ‌లంక బేజార్

Leave A Reply

Your Email Id will not be published!