Modi : వారసత్వ రాజకీయాలకు పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ. వారి హయాంలోనే దేశం అన్ని రకాలుగా నష్ట పోయింది. దానిని మేం గుర్తించాం. తాము అధికారంలోకి వచ్చాకే దేశ భవిష్యత్తు పూర్తిగా మారి పోయిందన్నారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Modi).
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రధాని(Modi) ప్రసంగించారు.
గత రెండేళ్లుగా 80 కోట్ల మంది పేదలు, దళితులు, వెనుకబడిన, గిరిజనులకు ఉచిత రేషన్ అందుబాటులోకి వచ్చిందని అదంతా తమ చలవేనని చెప్పారు. ఈ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని చూసి యావత్ ప్రపంచం విస్తు పోయిందన్నారు.
అంతే కాదు కరోనా మహమ్మారిని అడ్డుకోవడంలో భారత దేశం ముందంజలో ఉందన్నారు. వ్యాక్సినేషన్ లో చైనా తర్వాత మనమేనని చెప్పారు. అయితే కోట్లాది మంది పేదల ఆకలి తీర్చినందుకు తాను సంతోషంగా ఉన్నానని అన్నారు మోదీ.
కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలతో దేశాన్ని సర్వ నాశనం చేసిందని ఆరోపించారు. వారి నిర్వాకం వల్లనే దేశం వెయ్యేళ్లు వెనుక పడిందని అభివృద్ది విషయంలో అన్నారు.
ఇక అసెంబ్లీ ఎన్నికల చివరి, ఏడో దశ పోలింగ్ కు ముందు ప్రచారం చేపట్టారు. యోగి పాలనలో రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ది చెందుతోందన్నారు.
ఇక్కడి ప్రజలు రాజ వంశాలను కోరుకోవడం లేదన్నారు. తాము పవర్ లోకి రావడం ఖాయమన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో తాము పవర్ లోకి రావడం ఖాయమన్నారు.
Also Read : మోదీ అబద్దాలు ఆడడంలో దిట్ట