Manchu Family : ఈ ఏడాది అంతగా అచ్చి రానట్టుంది మంచు ఫ్యామిలీకి . సినీ నటుడు మంచు మోహన్ బాబు, తనయుడు మా చీఫ్ మంచు విష్ణుపై(Manchu Family) నాయీ బ్రాహ్మణ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఇప్పటికే బీసీ సంక్షేమ సంఘం చీఫ్ ఆర్. కృష్ణయ్య బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు. విష్ణు హెయిర్ స్టైలిష్ నాగశ్రీను తమ ఇంట్లో విలువ కలిగిన వస్తువులు చోరీ చేశాడంటూ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది మంచు ఫ్యామిలీ.
ఈ మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో నాయి బ్రాహ్మణ కులానికి చెందిన నాగశ్రీను పూర్తి వివరణ ఇచ్చాడు.
తాను దొంగతనం చేయలేదని, తనను కులం పేరుతో, వృత్తి పేరుతో నానా రకాలుగా దుర్భాష లాడారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారం చిలికి చిలికి గాలి వానగా మారింది.
ఈ వ్యవహారంలో నాగ శ్రీనుతో పాటు వెనుకబడిన తరగతుల కులాందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
అంతే కాకుండా ఇవాళ మంచు మోహన్ బాబు, విష్ణు లపై నాయీ బ్రాహ్మణ సంఘాల నేతలు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. అత్యంత వెనుకబడిన కులం వారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని పేర్కొన్నారు.
వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఆయా సంఘాలతో కలిసి ఆ సంఘం చీఫ్ పాల్వాయి శ్రీనివాస్ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ బయట పెడితే అసలు దొంగలు ఎవరో తేలుతుందన్నారు.
Also Read : ప్రభాస్ ను చూసి విస్తు పోయా