Rahul Gandhi : త్వ‌ర‌గా మీ ట్యాంకులు నింపండి

పెట్రో వడ్డ‌న‌కు మోదీ స‌ర్కార్ సిద్దం

Rahul Gandhi  : ఈనెల 7వ తేదీతో దేశంలోని ఐదు రాష్ట్రాల‌కు సంబంధించి ఎన్నిక‌లు పూర్త‌యిన‌ట్టే. ఇక ఈనెల 10న పూర్తి స్థాయిలో ఆయా రాష్ట్రాల‌కు సంబంధించి ఫ‌లితాలు వెలువ‌డ‌తాయి.

ఈ త‌రుణంలో కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi )సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశంలోని వాహ‌న‌దారుల‌కు , ముఖ్యంగా డీజిల్, పెట్రోల్ వాడ‌కం దారుల‌కు ముంద‌స్తు హెచ్చ‌రిక‌లు జారీ చేశాడు.

ఎన్నికలైన వెంట‌నే ప్ర‌ధాని మోదీ స‌ర్కార్ త‌ప్ప‌నిస‌రిగా ఆయిల్ ధ‌ర‌లు పెంచుతాడ‌ని అంత‌లోపే మీరు జాగ్ర‌త్త ప‌డండి అంటూ సూచించాడు రాహుల్ గాంధీ. ఇప్పటికే రూ. 110 దాటింది.

రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ తో పాటు గ్యాస్ కూడా పెరుగుతుంద‌ని స్ప‌ష్టం చేశాడు. దీని వ‌ల్ల సామాన్యులు బ‌తికే ప‌రిస్థితి లేకుండా పోతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇవాళ ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఎన్నిక‌ల కార‌ణంగా ప్ర‌భుత్వ రంగ చ‌మురు సంస్థ‌లు లాక్ చేశాయ‌ని, వ‌చ్చే వారం పూర్తి కావ‌డంతో అవి త‌మ ధ‌రా భారాన్ని మోపేందుకు రెడీగా ఉన్నాయ‌ని తెలిపాడు రాహుల్ గాంధీ(Rahul Gandhi ).

అందుకే అవ‌స‌ర‌మైన వారంతా త‌మ ట్యాంకుల‌ను ముంద‌స్తుగా నింపు కోమంటూ స‌ల‌హా ఇచ్చారు. మోదీ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల ఆఫ‌ర్ ముగియ బోతోందంటూ ఎద్దేవా చేశారు.

ధ‌ర‌లను అదుపు చేయడంలో పూర్తిగా వైఫ‌ల్యం చెందారంటూ మండిప‌డ్డారు. ప్ర‌ధానికి ప్ర‌చారం మీద ఉన్న ధ్యాస దేశం ప‌ట్ల‌, ప్ర‌జ‌ల ప‌ట్ల లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ధ‌ర‌లు పెంచితే ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని మోదీ నాట‌కం ఆడారంటూ మండిప‌డ్డారు.

Also Read : నాటి పాల‌కుల వైఫ‌ల్యం దేశానికి న‌ష్టం

Leave A Reply

Your Email Id will not be published!