Wriddhiman Saha : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రికెటర్ వృద్ది మాన్ సాహా – జర్నలిస్ట్ వ్యవహారం కొలిక్కి వచ్చింది. తనను సదరు జర్నలిస్టు బెదిరింపులకు గురి చేశాడంటూ ఆరోపించాడు.
అదే సమయంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పై కూడా కామెంట్ చేశాడు. మరో వైపు వాట్సాప్ లో బీసీసీఐ చీఫ్ గంగూలీ షేర్ చేసిన మెస్సేజ్ లు కూడా బయట పెట్టాడు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపాడు గంగూలీ సోదరుడు.
ఇదిలా ఉండగా సాహా (Wriddhiman Saha)చేసిన ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు బీసీసీఐ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. అంతే కాదు సదరు పాత్రికేయుడు ఎలా తనను బెదిరిస్తూ మెస్సేజ్ లు పెట్టాడో కూడా బట్ట బయలు చేశాడు.
ఈ అంశం పెద్ద దుమారం చెలరేగింది. ఘటనపై వెంటనే స్పందించి భారత క్రికెట్ నియంత్రణ మండలి. మొదట సదరు జర్నలిస్టు పేరు ఎందుకు చెప్పాలని మిన్నకుండి పోయాడు.
అతడి కెరీర్ కు ఇబ్బంది కలుగుతుందని భావించాడు. కాగా బీసీసీఐ మాత్రం చెప్పాల్సిందేనంటూ పట్టు పట్టింది. ఈ మేరకు బయటకు పొక్కకుండా కమిటీ ముందు చెప్పాలని సూచించింది.
ఇందుకు పూర్తి సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసింది. మొదట నిరాకరించినా ఆ తర్వాత దాదా భరోసా ఇవ్వడంతో ఇవాళ బీసీసీఐ కమిటీ ముందు బెదిరింపులకు గురి చేసిన జర్నలిస్టు పేరు బయట పెట్టాడు.
ఇదిలా ఉండగా సదరు జర్నలిస్టు పై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది.
Also Read : తప్పంతా నాదే వాళ్లది కాదు