Russia Ukraine Digital War : ఉక్రెయిన్ – రష్యా మధ్య జరుగుతున్న యుద్దం ఎప్పటి దాకా కొనసాగుతుందో చెప్పలేం. దీంతో తన కంట్లో నలుసుగా మారిన ఉక్రెయిన్ పై రష్యా అధ్యక్షుడు జెలెన్ స్కీ కన్నెర్ర చేశాడు.
ఉక్రెయిన్ ఆర్మీ తలవంచేంత దాకా తాము ఒప్పుకునే ప్రసక్తి లేదని హెచ్చరించాడు. ఇంకో వైపు ప్రాణం ఇచ్చేందుకు రెడీగా ఉన్నానని దమ్ముంటే తేల్చుకుందాం రా అంటూ పుతిన్ కు సవాల్ విసిరాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు.
బాంబులు, మిస్సైళ్లతో దుమ్ము రేపుతూ దూసుకు వెళుతోంది రష్యా. అందుకు ఏ మాత్రం తల దించకుండానే పోరాడుతోంది ఈ చిన్న దేశం.
ఇదే సమయంలో తమకు ఎవరి సహాయం అక్కర్లేదని, జాలి కురిపించకండి అంటూ జెలెన్ స్కీ సతీమణి సంచలన ప్రకటన చేసింది. తమకు ప్రపంచం నుంచి మానిసక పరమైన మద్దతు మాత్రమే కావాలని పిలుపునిచ్చారు.
దేశ ప్రజలు తమ ఆత్మ గౌరవం కోసం చేస్తున్న పోరాటమని ప్రకటించింది. ఈ తరుణంలో ఆమె ఓ టెలిగ్రామ్ ఛానల్ ను ఓపెన్ చేసి స్పూర్తి నింపే ప్రయత్నం చేస్తోంది.
ఇదిలా ఉండగా బాంబులు, మిస్సైల్స్ , తుపాకులతో కాకుండా సైబర్ దాడులకు శ్రీకారం చుట్టింది ఉక్రెయిన్. ఇదిలా ఉండగా రష్యా నుంచి దాడుల్ని తట్టుకునేందుకు అన్ని మార్గాలపై ఫోకస్ పెట్టింది.
సైబర్ యుద్దాన్ని స్పీడ్ పెంచింది. ఆ దేశానికి చెందిన హ్యాకర్స్ ముందుకు వచ్చారు స్వచ్చందంగా. డిజిటల్ ఆర్మీ(Russia Ukraine Digital War) గా ఏర్పడి దాడుల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు.
రష్యాకు చెందిన సైట్స్ ను బ్లాక్ చేసే పనిలో పడ్డారు. ఇంకో వైపు రష్యా కూడా ఇందుకు ప్రతిగా పని చేసుకుంటూ పోతోంది.
Also Read : మాట తప్పిన పుతిన్ పై మండిపాటు