Mithali Raj : చ‌రిత్ర సృష్టించిన మిథాలీ రాజ్

అరుదైన మైలురాయి సాధించిన క్రికెట‌ర్

Mithali Raj  : హైద‌రాబాదీ స్టార్ ప్లేయ‌ర్, భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ (Mithali Raj )అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది. త‌న క్రికెట్ కెరీర్ లో మ‌రో మైలురాయి దాటింది. ఎలైట్ లిస్టులో స్టార్ ప్లేయ‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ తో జత క‌ట్టింది.

కెప్టెన్ మిథాలీరాజ్ చిరకాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్ తో జ‌రుగుతున్న మ‌హిళ‌ల వ‌ర‌ల్డ్ క‌ప్ లో చ‌రిత్ర‌ను తిర‌గ రాసింది. ఈ విష‌యాన్ని భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి – బీసీసీఐ త‌న అధికారిక ట్విట్ట‌ర్ లో వెల్ల‌డించింది.

ఇప్ప‌టి వ‌ర‌కు మిథాలీ రాజ్ త‌న కెరీర్ లో భాగంగా ఆరు వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీల‌లో ఆడింది. మౌంట్ మౌన్ గ‌నుయ్ లోని బే ఓవ‌ల్ లో పాకిస్తాన్ తో జ‌రుగుతున్న ఈ వ‌న్డే మ్యాచ్ సంద‌ర్భంగా ఈ ఘ‌న‌త సాధించింది.

మ్యాచ్ లో భాగంగా మైదానంలోకి దిగ‌డంతో ఆరు ప్ర‌పంచ క‌ప్ లీగ్ లలో ఆడిన ఏకైక మొద‌టి మ‌హిళా క్రికెట‌ర్ గా నిలిచింది. ఇక మిథాలీ రాజ్ బ్యాట‌ర్ గా 2000లో ఇదే న్యూజిలాండ్ వేదిక‌గా వ‌ర‌ల్డ్ క‌ప్ లో అరంగేట్రం చేసింది.

దీనికి ముందు 2005, 2009, 2013, 2017 సంవ‌త్స‌రాల‌లో జ‌రిగిన ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీల‌లో పాల్గొంది మిథాలీరాజ్. ప్ర‌స్తుతం 2022 లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తుంది.

అంతే కాకుండా ఆమెను భార‌తీయులంతా మ‌హిళా స‌చిన్ టెండూల్క‌ర్ అని పిలుస్తారు. ప్ర‌స్తుతానికి టీమిండియాకు కెప్టెన్ గా ఉన్నారు మిథాలీ రాజ్.

త‌న కెరీర్ లో ఎన్నో మైలురాళ్లు సాధించిన మిథాలీరాజ్ ఇక ఈ టోర్నీనే లాస్ట్ అని ప్ర‌క‌టించింది. ఆ త‌ర్వాత తాను త‌ప్పుకోనున్న‌ట్లు వెల్ల‌డించింది.

Also Read : మొహాలీలో ఎదురీదుతున్న శ్రీ‌లంక

Leave A Reply

Your Email Id will not be published!