Putin : అణుబాంబు త‌యారు చేస్తున్న ఉక్రెయిన్

ఆరోప‌ణ‌లు చేసిన ర‌ష్యా చీఫ్ పుతిన్

Putin  : ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమీర్ పుతిన్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. ఉక్రెయిన్ పై ఏక‌ప‌క్షంగా దాడులు జ‌రుపుతూ నిస్సిగ్గుగా ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ వ‌స్తున్న పుతిన్ (Putin )మ‌రోసారి నోరు పారేసుకున్నాడు. ఆయ‌న ఉక్రెయిన్ పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించాడు.

చెర్నోబిల్ కేంద్రంగా ఉక్రెయిన్ అణుబాంబు త‌యారు చేస్తోందంటూ మండిప‌డ్డారు. పుతిన్ మ‌నో వేదన‌తో ప్ర‌సంగించాడు. ఈ విష‌యాన్ని వీడియో ద్వారా తెలిపాడు.

అంతే కాకుండా త‌న స్వంత అణ్వాయుధాల‌ను సృష్టించేందుకు త‌మ దేశానికి చెందిన ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగిస్తోందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు పుతిన్.

అయితే ఇలా త‌యారు చేస్తున్నందుకు చేసిన ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు తమ వ‌ద్ద లేవ‌న్నాడు. ప‌క్కాగా చెర్నోబిల్ లో త‌యారు చేస్తుంద‌న్న స‌మాచారం త‌మ వ‌ద్ద ఉంద‌న్నాడు పుతిన్(Putin ).

ఉక్రెయిన్ ప్లూటోనియం ఆధారిత అణ్వాయుధ నిర్మాణానికి ద‌గ్గ‌రగా ఉంద‌ని ఆరోపించాడు. ఆ అణుబాంబుకు డ‌ర్టీ బాంబ్ అని పేరు కూడా పెట్టార‌ని ధ్వ‌జ‌మెత్తాడు పుతిన్. అయితే పాశ్యాత్య దేశాలు ర‌ష్యా ఆరోప‌ణ‌ల‌ను తీవ్రంగా ఖండించాయి.

2000లో మూసి వేసిన చెర్నోబిల్ న్యూక్లియ‌ర్ ప్లాంట్ లో ఉక్రెయిన్ అణ్వాయుధాల‌ను అభివృద్ధి చేస్తోందంటూ ర‌ష్యా స‌మ‌ర్థ‌వంత‌మైన సంస్థ ప్ర‌తినిధి ధ్రువీక‌రించారు.

దీని ఆధారంగానే ర‌ష్యా చీఫ్ పుతిన్ ఈ విమ‌ర్శ‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇదిలా ఉండ‌గా సోవియ‌ట్ యూనియ‌న్ దేశం విచ్ఛిన్నం త‌ర్వాత 1994లో అణ్వాయుధాల‌ను వ‌దులుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది ఉక్రెయిన్ ప్ర‌భుత్వం.

అణు క్ల‌బ్ లో తిరిగి చేరే ఆలోచ‌న ఏదీ లేద‌ని స్ప‌ష్టం చేసింది. అణుబాంబు త‌యారు చేయ‌డం అంటే ఉక్రెయిన్ ర‌ష్యాపై యుద్దం ప్ర‌క‌టించ‌డ‌మేనంటూ పుతిన్ ఆరోపించాడు.

Also Read : ర‌ష్యా..ఉక్రెయిన్ సైబ‌ర్ వార్

Leave A Reply

Your Email Id will not be published!