Modi : శివాజీ జీవితం దేశానికి ఆద‌ర్శం

మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మెట్రో కోచ్ ల త‌యారీ

Modi : ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హ‌రాజ్ జీవితం దేశానికి ఆద‌ర్శ‌మ‌న్నారు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(Modi). ఇవాళ ఆయ‌న మ‌హారాష్ట్రంలోని పూణేలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన శివాజీ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు.

ఈ విగ్ర‌హంతో పాటు మెట్రో రైలు ప్రాజెక్టును కూడా ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియా ప‌థ‌కం కింద దేశీయంగా త‌యారు చేసిన అల్యూమినియం బాడీ కోచ్ ల‌ను క‌లిగి ఉన్న మొట్ట మొద‌టి ప్రాజ‌జెక్టు ఇది.

పూణేలో 12 కిలోమీట‌ర్ల మేర 32.2 కిలోమీట‌ర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్టు క‌లిగి ఉంది. ఇక మ‌హారాష్ట్ర మ‌రాఠా యోధుడు ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హ‌రాజ్ 9.5 అడుగుల ఎత్తైన విగ్ర‌హాన్ని మోదీ ఆవిష్క‌రించి న‌మ‌స్క‌రించారు.

అనంత‌రం ఎంఐటీ మైదానంలో జ‌రిగిన ర్యాలీలో ప్ర‌సంగించేందుకు గార్ వేర్ కాలేజీ నుంచి ఆనంద న‌గ‌ర్ మెట్రో స్టేష‌న్ వ‌ర‌కు మెట్రో రైడ్ చేప‌ట్టారు. స్కూలు పిల్ల‌ల‌తో (Modi)ఆయ‌న మాట్లాడారు

. ప్ర‌పంచ స్థాయిలో మౌలిక స‌దుపాయాలు క‌ల్పించాల‌నే ఉద్దేశంతో మోదీ దేశ వ్యాప్తంగా మెట్రో రైళ్ల‌ను ఆధునీక‌రించే ప‌నిలో ప‌డ్డారు. అంతే కాకుండా రోడ్డు, ర‌వాణా సౌక‌ర్యాలు మెరుగు ప‌డితేనే దేశం కొంత ముందుకు వెళుతుంద‌న్న భావ‌న‌లో ఉన్నారు.

ఇందులో భాగంగానే మెట్రో ప్రాజెక్టు పునాది రాయిని కూడా 2016 డిసెంబ‌ర్ 24న ప్ర‌ధాన మంత్రి వేశారు. ఈ ప్రాజెక్టు ఖ‌ర్చు మొత్తం రూ. 11, 400 కోట్లు. మేక్ ఇన్ ఇండియా అన్న‌ది మోదీ నినాదం. అన్ని రంగాల‌లో దేశం అభివృద్ది చెందుతోంద‌న్నారు ప్ర‌ధాన మంత్రి.

Also Read : త్వ‌ర‌గా మీ ట్యాంకులు నింపండి

Leave A Reply

Your Email Id will not be published!