KTR : ప్ర‌ధాని మోదీ తెలంగాణ వ్య‌తిరేకి

ఆ పార్టీ నాయ‌కులపై కేటీఆర్ ఫైర్

KTR  : రాష్ట్ర ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌ధాని మోదీతో పాటు బీజేపీ నాయ‌కుల‌ను టార్గెట్ చేశారు. పీఎంతో పాటు అంతా తెలంగాణ ప్ర‌భుత్వానికి, రాష్ట్రానికి వ్య‌తిరేకులేనంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

వ‌రంగ‌ల్ కాజీపేట‌లో రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేయ‌లేమంటూ కేంద్ర మంత్రి ప్ర‌క‌టించ‌డంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. పూట‌కో మాట మాట్లాడుతూ రాష్ట్రానికి తీవ్ర న‌ష్టం క‌లిగిస్తున్న ఆ పార్టీకి ప్ర‌జ‌లు త‌గిన రీతిలో బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు.

తెలంగాణ వ్య‌తిరేక విధానాల‌ను ద‌మ్ముంటే రాష్ట్ర నేత‌లు కేంద్రాన్ని నిల‌దీయాల‌ని ఆయ‌న స‌వాల్ విసిరారు. కోచ్ ఫ్యాక్ట‌రీ ఎందుకు మంజూరు చేయ‌డం లేదో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు జ‌వాబు చెప్పాల‌న్నారు.

ఐటీఐఆర్ ప్రాజెక్టు, బ‌య్యారం ఉక్కు ఫ్యాక్ట‌రీ, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హ‌దాతో పాటు పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో పొందు ప‌ర్చిన హామీల అమ‌లులో మోదీ ప్ర‌భుత్వం తెలంగాణ‌ను ప‌క్క‌న పెట్ట‌డం దారుణ‌మ‌న్నారు.

ఏ ఒక్క‌టి అమ‌లు చేసిన పాపాన పోలేదంటూ ప్ర‌ధానిపై సీరియ‌స్ అయ్యారు. తెలంగాణ ప్రాంత ప్ర‌యోజ‌నాలకు భంగం వాటిల్లుతుంటే బాధ్య‌త క‌లిగిన బీజేపీ నాయ‌కులు ఎందుకు అడ‌గ‌డం లేద‌ని నిల‌(KTR )దీశారు.

నిద్ర పోయారా అని ప్ర‌శ్నించారు. తెలంగాణ రాష్ట్రం ప‌ట్ల కేంద్రం ఎంతటి క‌క్ష సాధింపు ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తోంది, ఎంత‌టి వివ‌క్ష‌ను చూపుతుందో రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ లేద‌ని చెప్ప‌డ‌మే ఇందుకు తార్కాణ‌మ‌న్నాడు.

రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు కోసం ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం 150 ఎక‌రాల భూమిని సేక‌రించి కేంద్రానికి ఇచ్చామ‌ని తెలిపారు కేటీఆర్. కానీ కేంద్రం ప‌ట్టించు కోలేద‌ని ధ్వ‌జ‌మెత్తారు.

Also Read : రాజ‌కీయ వేదిక‌లుగా ఆధ్యాత్మిక కేంద్రాలు

Leave A Reply

Your Email Id will not be published!