Amit Shah : భారత దేశం నిర్వహించిన వివిధ తరలింపు కార్యక్రమాలలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ – సీఐఎస్ఎఫ్ నిర్వహించిన పాత్ర ప్రశంసనీయమని అన్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah).
తోటి భారతీయుల సంరక్షణలో ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా విధులు చేపట్టారని కొనియాడారు. చాలా మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది విలువైన జీవితాలను కోల్పోవాల్సి వచ్చిందన్నారు.
కేంద్ర భద్రతా సాయుధ దళాలలో సీఐఎస్ఎఫ్ కూడా అద్భుతమైన పాత్ర ను పోషిస్తోందని చెప్పారు. ఇవాళ ఘజియాబాద్ లో జరిగిన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు.
కరోనా వైరస్ మహమ్మారి సమయంలో విదేశాల నుంచి తిరిగి వస్తున్న భారతీయులను సీఐఎస్ఎఫ్ జవాన్లు, సిబ్బంది హృదయ పూర్వకంగా స్వాగతం పలికారని(Amit Shah) పేర్కొన్నారు.
ఆపరేషన్ గంగా కింద ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన పౌరులను కూడా వారు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకున్నారని ప్రశంసించారు. సీఐఎస్ఎఫ్ 53వ రైజింగ్ డే వేడుకల్లో అమిత్ షా పాల్గొన్నారు.
వారు ఈ సందర్భంగా ప్రదర్శించిన ధైర్య సాహసాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రైవేట్ పారిశ్రామిక, తయారీ రంగ యూనిట్లకు సమర్థవంతమైన భద్రతను అందించేందుకు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు , సీఐఎస్ఎఫ్ తో కలిసి పని చేస్తే బాగుంటుందన్నారు.
ఇదిలా ఉండగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ దేశంలోని కేంద్ర సాయుధ పోలీసు దళంలో ఒకటి. భారత దేశంలోని ఆరు పారా మిలిటరీ దళాలలో కీలకంగా ఉంది. ఇది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కింద పని చేస్తుంది.
Also Read : నాటి పాలకుల వైఫల్యం దేశానికి నష్టం