Shane Warne : ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ గుండె పోటుతో మరణించాడు. ఇదే విషయాన్ని వారి కుటుంబీకులు సైతం స్పష్టం చేశారు. కాగా థాయ్ లాండ్ లోని తన విల్లాలో మరణించిన వార్న్ వ్యవహారంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆయన ఆకస్మిక మృతిపై థాయ్ లాండ్ పోలీసులు ప్రాథమిక విచారణ జరిపారు. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. వార్న్(Shane Warne) మరణించిన గదిలో ఫ్లోర్, టవల్స్ పై రక్తపు మరకలు కనిపించినట్లు గుర్తించినట్లు వెల్లడించారు.
ఎక్కువ స్థాయిలో రక్తపు పోటుకు గురై భయాందోళనకు గురై ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో గదిలో వార్న్ అచేతనంగా పడి ఉండడాన్ని గుర్తించి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశామని స్నేహితులు తెలిపారు పోలీసులకు.
ఇవాళ థాయ్ పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో వార్న్ భౌతిక కాయానికి శవ పరీక్ష జరిపారు. ఈ రిపోర్టు రేపు రానున్నట్లు సమాచారం. ఈ నివేదిక వస్తేనే కానీ వార్న్(Shane Warne) ది సహజ మరణమా లేక అసహజ మరణమా అన్నది తేలుతుంది.
అంత వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇవాళే వార్న్ భౌతిక కాయాన్ని స్వస్థలమైన ఆస్ట్రేలియాకు తరలించనున్నారు. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక లాంఛనలాతో క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ అంత్యక్రియలకు ఏర్పాట్లు కూడా చేసింది.
ఓవర్ ఆల్ గా క్రికెట్ లో అన్న ఫార్మాట్ లలో కలిపి ఏకంగా 1000 వికెట్లు తీసిన క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు షేన్ వార్న్.
Also Read : భారత్ విజయం అతడే కీలకం