AP Assembly : ఏపీ బ‌డ్జెట్ స‌మావేశాల‌పై ఫోక‌స్

రేప‌టి నుంచి అసెంబ్లీ ప్రారంభం

AP Assembly : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి సంబంధించిన బ‌డ్జెట్ స‌మావేశంలో ఈనెల 7 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్ర‌ధానంగా కీల‌క అంశాలు చ‌ర్చ‌కు రానున్నాయి. అమ‌రావ‌తిలోని శాస‌న‌స‌భ స‌మావేశపు(AP Assembly) హాలులో గ‌వ‌ర్న‌ర్ విశ్వ భూష‌న్ హ‌రి చంద‌న్ హాజ‌ర‌వుతారు.

ఈ సంద‌ర్భంగా ఏపీ కేబినెట్ ఆమోదించిన బ‌డ్జెట్ గురించి ప్ర‌సంగిస్తారు. దీంతో స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్ప‌టికే రాష్ట్ర రాజ‌ధాని విష‌యంలో హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

వైసీపీ స‌ర్కార్ కు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిన ఈ వ్య‌వ‌హారంపై కోర్టు నీళ్లు చ‌ల్లింది. ఎట్టి ప‌రిస్థితుల్లో ఆరు నూరైనా స‌రే మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేసి తీరుతానంటూ ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ రెడ్డి (AP Assembly)ప్ర‌క‌టించారు.

ఆయ‌న ఒక్క‌సారి క‌మిట్ అయితే ఇక వెన‌క్కి త‌గ్గ‌రు. కానీ ఊహించ‌ని రీతిలో రాష్ట్ర హైకోర్టు ఆయ‌న‌కు , ఏపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా తీర్పు చెప్పింది. ఇదే స‌మ‌యంలో సీఆర్డీ చ‌ట్టం ర‌ద్దుపై ఇటీవ‌ల ఏపీ హైకోర్టు ప్ర‌భుత్వానికి కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది.

ఈ సంద‌ర్భంగా కోర్టు ఇచ్చిన తీర్పు సంచ‌ల‌నం క‌లిగించింది. దీనిపై పెద్ద రాద్దాంతం చోటు చేసుకుంది. రాజ‌ధానుల ఏర్పాటు, సీఆర్డీఏ చ‌ట్టం ర‌ద్దు చ‌ట్టం ప‌రిధిలోకి రాద‌ని, వీటిపై చ‌ట్టాలు చేసే హ‌క్కు శాస‌న‌స‌భ‌కు లేద‌ని సంచ‌ల‌న తీర్పు చెప్పింది.

దీనిని ప్ర‌తి ఒక్క‌రు వ్య‌తిరేకిస్తున్నారు. చ‌ట్టాలు త‌యారు చేసే శాస‌న‌స‌భ వ్య‌వ‌స్థ‌కు ప‌వ‌ర్స్ లేవ‌ని పేర్కొన‌డాన్ని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు త‌ప్పు ప‌డుతున్నారు.

దీనిపైనే ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు లేవ‌నెత్త‌నున్నారు. అంత‌కు ముందు ఇటీవ‌ల హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డికి అసెంబ్ల నివాళులు అర్పించ‌నుంది.

Also Read : ప్ర‌తి ఒక్క‌రిని క్షేమంగా తీసుకు వ‌స్తాం

Leave A Reply

Your Email Id will not be published!