Trump : అమెరికా మాజీ చీఫ్ డొనాల్డ్ మరోసారి నోరు పారేసుకున్నారు. ఒకరకంగా ఆయన చైనా, రష్యాలపై మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. ఇంకోరకంగా అటు బైడెన్ ను ఇటు జిన్ పింగ్, పుతిన్ లపై సెటైర్లు వేశారు.
ఉక్రెయిన్ పై రష్యా యుద్దం చేయడాన్ని ఆయన గర్హిస్తూనే ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అదేమిటంటే అమెరికా కు చెందిన ఎఫ్ -22 వార్ విమానాల్ పై చైనా పతాకాలు ఉంచి రష్యాపై బాంబులు వేయాలంటూ పిలుపునిచ్చారు.
ఆ తర్వాత చైనానే ఆ పని చేసిందంటూ ఈ ప్రపంచాన్ని నమ్మించాలని సూచించాడు. దీంతో రష్యా, చైనా దేశాలు కొట్లాడుకుంటే మనం ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చంటూ వ్యాఖ్యానించాడు ట్రంప్(Trump).
రిపబ్లికన్ జాతీయ కమిటీ ప్రధాన సమావేశంలో మాజీ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ట్రంప్ రెండు నాల్కల ధోరణి అవలంభిస్తూ వస్తున్నారు.
ఓసారి పుతిన్ ను సమర్థిస్తూనే ఇంకోసారి ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు. ఇదే సమయంలో ట్రంప్ ఇటీవల తన మాటల తూటాలను డైరెక్టుగా అమెరికా అధ్యక్షుడు, తన చిరకాల ప్రత్యర్థి జోసెఫ్ బైడెన్ పై ఎక్కు పెట్టారు.
అత్యంత బాధ్యతా రాహిత్యమైన పాలన సాగిస్తున్న బైడెన్ నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నాడంటూ మండిపడ్డారు ట్రంప్. తానే గనుక ఉండి ఉంటే ఉక్రెయిన్ కు ఇలాంటి గతి పట్టేది కాదన్నాడు.
యుద్దం చేయాలంటే దమ్ముండాలని కానీ ఆఫ్గనిస్తాన్ విషయంలో అమెరికా సేనలు తిరిగి రావడంతో ఉన్న పరువు పోయిందంటూ ఎద్దేవా చేశాడు ట్రంప్.
Also Read : అణుబాంబు తయారు చేస్తున్న ఉక్రెయిన్