Pope Francis : యుద్దం రక్తపాతం శాంతికి విఘాతం
ఆవేదన వ్యక్తం చేసిన పోప్ ఫ్రాన్సిస్
Pope Francis : ఉక్రెయిన్ పై ఏకపక్ష దాడుల్ని వెంటనే రష్యా ఆపాలని పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis)పిలుపునిచ్చారు. యుద్దం శాంతికి విఘాతమని ఇది ఎంత మాత్రం ప్రపంచానికి మంచిది కాదని స్పష్టం చేశారు.
ఉక్రెయిన్ లో రక్తం, కన్నీళ్లు ఒకే చోట ప్రవహిస్తున్నాయని వాపోయారు. చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ఆధిపత్యం వల్ల కాదని పేర్కొన్నారు. రష్యా దాడిని తీవ్రంగా ఖండించారు..తప్పు పట్టారు కూడా.
క్యాథలిక్ చర్చి చీఫ్ అయిన పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ సిటీ లోని పీటర్స్ స్క్వేర్ లో ప్రజలను ఉద్దేశించి ఆదివారం ప్రసంగించారు. ఇది సైనిక చర్య కానే కాదు..మరణం, విధ్వంసానికి దారి తీసే యుద్దం అంటూ అభివర్ణించారు.
సున్నితమైన ఈ అంశాన్ని సీరియస్ గా చేయడం ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు పోప్. విచిత్రం ఏమిటంటే పోప్ తన పరిధి దాటి రష్యా రాయబారిని కలవడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగించింది.
వీరిద్దరి చర్చల్లో ప్రధానంగా ఉక్రెయిన్ పై దాడి ఆపాలని కోరినట్లు తెలిసింది. అంతే కాదు ఇప్పటికే పోప్ ఫ్రాన్సిస్ రష్యన్ చర్చి చీఫ్ తో ఇప్పటికే ఒక సారి సమావేశం అయ్యారు. రెండోసారి కూడా కలిసేందుకు ఓకే చెప్పారు.
యుద్దం ఆపేందుకు తాను మాస్కోకు వెళ్లేందుకు సిద్దమని ప్రకటించారు పోప్ ఫ్రాన్సిస్. ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రోటోకాల్స్ అవసరం లేదని స్పష్టం చేయడం గమనార్హం.
దైవం విధించే శిక్ష నుంచి ఎవరూ తప్పించు కోలేరంటూ పోలాండ్ ఆర్చ్ బిషప్ వ్యాఖ్యానించడం కలకలం రేపింది.
Also Read : త్వరితగతిన సామాన్య భక్తులకు సర్వదర్శనం మా లక్ష్యం