Dominic Raab : ఉక్రెయిన్ పై దాడుల పరంపర కొనసాగిస్తూనే ఉన్నది రష్యా. ఇప్పటికే బ్రిటన్ తో సహా పలు దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. కానీ వాటిని బేఖాతర్ చేస్తూ రష్యా చీఫ్ పుతిన్ ముందుకు కదులుతున్నారు.
ఎవరినీ పట్టించు కోవడం లేదు. భారత దేశంతో పాటు పలు దేశాలు చేసిన విన్నపానికి ఆయన స్పందించారు. ఈ మేరకు ఐదున్నర గంటల పాటు తాత్కాలిక విరామం ప్రకటించారు.
అయితే ఉన్నట్టుండి తన మాటను తప్పారంటూ ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీ ఆరోపించారు. ఈ సమయంలో రష్యాతో చిరకాలం స్నేహంగా ఉంటూ వచ్చిన భారత్ వైపు యావత్ ప్రపంచం చూస్తోంది.
ఈ మేరకు బ్రిటన్ ఉప ప్రధాన మంత్రి డొమినిక్ రాబ్ (Dominic Raab)ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నం చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి సూచించారు.
ఇండియాతో పాటు చైనా కూడా ఇదే పని చేయాలని కోరారు. యూఎన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశం. భారత్ కూడా ముందుకు వస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.
విచిత్రం ఏమిటంటే చైనా, ఇండియా ఈ దురాక్రమణపై ఎలాంటి వ్యాఖ్యలు చేయక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. రష్యాకు వ్యతిరేకంగా తీర్మానం చేసే సమయంలో కూడా ఈ రెండు దేశాలు ఓటు వేయకుండా దూరం గా ఉన్నాయని గుర్తు చేశారు.
ఇదే సమయంలో తమ దేశంపై ఆర్థిక ఆంక్షలు విధించడం అంటే ఒక రకంగా రష్యాపై యుద్దం ప్రకటించినట్లేనని పుతిన్ పేర్కొనడాన్ని తప్పు పట్టారు డిప్యూటీ ప్రైమ్ మినిష్టర్.
Also Read : 11 వేల మంది రష్యన్ సైనికులు ఖతం