Mukul Arya : భారత దేశానికి చెందిన రాయబారిగా పని చేస్తున్న ముకుల్ ఆర్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన పాలస్తీనాలో భారత రాయబారిగా పని చేస్తున్నారు.
పాలస్తీనాలోని రామల్లాహ్ లోని భారత ఎంబసీలో ఆయన అచేతనంగా పడి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇదిలా ఉండగా ముకుల్ ఆర్య(Mukul Arya) చని పోయిన విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ ధ్రువీకరించారు.
ముకుల్ ఆర్య మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా ఆర్య ఎలా చని పోయారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
భారత ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది.
భారత ప్రతినిధి ముకల్ ఆర్య మరణించడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు మంత్రి జైశంకర్.
అత్యంత ప్రతిభావంతమైన ,తెలివి తేటలు, అంకితభావం కలిగిన అధికారి అని ఆయన పేర్కొన్నారు.
ముకుల్ ఆర్య ఆత్మకు శాంతి చేకూరాలని జై శంకర్ తన అధికారిక ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ముకుల్ ఆర్య ఉన్నత విద్యావంతుడు.
ప్రపంచ పరిణామాలు, దేశానికి సంబంధించిన అంశాల పట్ల మంచి పట్టు ఉన్న ఉన్నతాధికారిగా పేరొందారు.
ముకుల్ ఆర్యా 2008వ బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ కు చెందిన అధికారి. ఢిల్లీలోని ప్రతిష్టాత్మకమైన జేఎన్ యూ , ఢిల్లీ యూనివర్శిటీలో చదువుకున్నారు.
ముకుల్ ఆర్య కాబూల్ , మాస్కలోని భారతీయ రాయబార కార్యాలయాల్లో , ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆఫీసులోనూ విధులు సమర్థవంతంగా నిర్వహించారు. అంతే కాకుండా యునెస్కోకు భారత శాశ్వత ప్రతినిధి బృందంలో కీలకంగా వ్యవహరించారు.
Also Read : యూపీలో బారులు తీరిన ఓటర్లు