Putin Zelensky : త‌ల వంచేంత దాకా యుద్ద‌మే

త‌గ్గేదే లేదంటున్న పుతిన్

Putin Zelensky : ఉక్రెయిన్ కు మ‌రోసారి వార్నింగ్ ఇచ్చారు ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తాము త‌గ్గేదే లేదంటున్నారు. ఉక్రెయిన్ ఆర్మీతో పాటు చీఫ్ జెలెన్ స్కీ త‌మ‌కు లొంగి పోయేంత దాకా ఈ సైనిక చ‌ర్య కొన‌సాగుతూ ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

కాద‌ని ఏ దేశ‌మైనా ఉక్రెయిన్ కు సాయంగా వ‌చ్చినా లేదా దాని కోసం గొంతెత్తినా తాము ఊరుకోబోమంటూ పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. ఓ వైపు అమెరికా, బ్రిట‌న్, ఫ్రాన్స్ తో పాటు యూరోపియ‌న్ దేశాలు, ఐక్య రాజ్య స‌మితి యుద్దాన్ని ఆపాల‌ని కోరాయి.

కానీ ప‌ట్టించు కోవ‌డం లేదు. ఇజ్రాయిల్ ప్ర‌ధాన మంత్రి తాము ఇరు దేశాల మ‌ధ్య మ‌ధ్య‌వ‌ర్తిత్వం నెరిపేందుకు సిద్దంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించాడు. కానీ డోంట్ కేర్ అన్నాడు పుతిన్. బేష‌ర‌తుగా లొంగి పోవాల్సిందేన‌ని మ‌రోసారి హెచ్చ‌రిక చేశాడు.

త‌మ డిమాండ్లు నెర‌వేరేంత దాకా యుద్దం కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా ఆయ‌న ఉన్న‌ట్టుండి ఓ సూచ‌న కూడా చేశారు ఉక్రెయిన్(Putin Zelensky) కు. అదేమిటంటే మూడో రౌండ్ శాంతి చ‌ర్చ‌ల్లో నిర్మాణాత్మ‌క విధానాన్ని అవ‌లంభించాల‌ని సూచించాడు.

అలా అయితేనే త‌న‌కు ఉక్రెయిన్ కు మంచిద‌న్నాడు. ఇప్ప‌టికే ప‌లు నగ‌రాల‌ను స్వాధీనం చేసుకుంటూ వ‌చ్చిన ర‌ష్యా ఉక్రెయిన్ రాజ‌ధాని విష‌యంలో ఇంకా వెనుకంజ‌లో ఉంది.

కాగా ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీ మాత్రం తాను చావ‌నైనా చ‌స్తా కానీ ర‌ష్యాకు లొంగ‌బోనంటూ ప్ర‌క‌టించాడు. ఈ త‌రుణంలో ట‌ర్కీ ర‌ష్యా చీఫ్ పుతిన్ తో మాట్లాడింది. వెంట‌నే యుద్దాన్ని ఆపాల‌ని కోరింది.

Also Read : మ‌ధ్య వ‌ర్తిత్వానికి ఇజ్రాయెల్ రెడీ

Leave A Reply

Your Email Id will not be published!