Dhankar Mamata : దీదీ రండి మాట్లాడుకుందాం

సీఎంకు లేఖ రాసిన గ‌వ‌ర్న‌ర్

Dhankar Mamata  : బీజేపీ యేత‌ర రాష్ట్రాల‌లో గ‌వ‌ర్న‌ర్లకు సీఎంల‌కు అస్స‌లు పొస‌గ‌డం లేదు. కేర‌ళ‌, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, ప‌శ్చిమ బెంగాల్ , ఢిల్లీ రాష్ట్రాల‌లో ప‌రిస్థితి ఆశాజ‌నకంగా లేదు.

ప్ర‌ధానంగా సీఎం, గ‌వ‌ర్న‌ర్ల మ‌ధ్య యుద్దం తారాస్థాయికి చేరింది మాత్రం ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో. ఒక‌రిపై మ‌రొక‌రు తీవ్ర ఆరోప‌ణ‌లు చేసుకున్నారు.

ఒకానొక స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్ ధ‌న్ క‌ర్ (Dhankar Mamata )త‌మ‌కు వ‌ద్దంటూ బ‌హిరంగంగానే డిమాండ్ చేశారు. ఇదే విష‌యంపై ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్ర చ‌రిత్ర‌లో అసెంబ్లీలో తీర్మానం చేశారు.

తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా గ‌వ‌ర్న‌ర్ అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారంటూ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ. ఇదే విష‌యంపై ఎంపీలు సైతం లోక్ స‌భ స్పీక‌ర్ కు ఫిర్యాదు చేశారు.

సీఎం స్వ‌యంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని క‌లిసి గ‌వ‌ర్న‌ర్ త‌మ‌కు అవ‌స‌రం లేదంటూ స్ప‌ష్టం చేసింది. అంతే కాకుండా సుదీర్ఘ లేక కూడా రాసింది. ఇరువురి మ‌ధ్య మాట‌ల యుద్దం మ‌రింత పెరిగింది.

ఆయ‌న‌కు పిచ్చి ప‌ట్టింద‌ని, గ‌వ‌ర్న‌ర్ గా ప‌ని చేయ‌డం లేద‌ని, అలా వ్య‌వ‌హ‌రించ‌డం లేదంటూ ఆరోపించారు సీఎం. గ‌వ‌ర్న‌ర్ పేరుతో భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఫేవ‌ర్ చేసేలా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారంటూ మండిప‌డ్డారు.

దీంతో ట్విట్ట‌ర్ వేదిక‌గా ఒక‌రిపై మ‌రొక‌రు సీరియ‌స్ కామెంట్స్ చేశారు. తాజాగా గ‌వ‌ర్న‌ర్ కొంచెం త‌గ్గారు. బెంగాల్ స‌ర్కార్, గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య వివాదాలు నెల‌కొన్న నేప‌థ్యంలో సీఎంకు ధ‌న్ క‌ర్ ముందుగా స్పందించారు.

ఈ మేర‌కు త‌న‌తో చ‌ర్చించేందుకు ర‌మ్మంటూ ఓ లేఖ కూడా రాశారు. ఇదిలా ఉండ‌గా రాష్ట్ర స్పీక‌ర్ గంట‌కు పైగా గ‌వ‌ర్న‌ర్ తో భేటీ కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఆయ‌న రాసిన లేఖ‌పై ఇంకా స్పందించ లేదు సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ.

Also Read : జ‌స్టిస్ ఖురేషీ వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం

Leave A Reply

Your Email Id will not be published!