AP Assembly : ఏపీ గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రసంగించారు. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం రంగాలపై ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపట్టిన పథకాలు అద్భుతంగా ఉన్నాయంటూ ప్రశంసించారు.
ప్రధానంగా సీఎం జగన్ జనరంజక పాలన అందిస్తున్నారంటూ ప్రశంసించారు. ఒకరకంగా జగన్ కు ఇది బూస్ట్ లాంటిదని చెప్పక తప్పదు. ఇక ఏపీలో ఉగాది నుంచి కొత్త జిల్లాలల్లో పాలన ప్రారంభం అవుతుందన్నారు గవర్నర్(AP Assembly ).
బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. రాబోయే ఏడాదికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 16.82 శాతం సమగ్ర వృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందన్నారు.
రూ. 1, 04, 758 కోట్లుగా ఉందని వెల్లడించారు. గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ది కోసం రూ. 6, 4000 కోట్లను ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. 3 వేల కిలోమీటర్ల పొడవైన రెండు లైన్ల రోడ్లను ఇందులో చేర్చడం జరిగందని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న మన బడి నాడు నేడు సూపర్ సక్సెస్ అయ్యిందన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు తీసిపోని విధంగా తయారు చేశారన్నారు.
ఇంకా అభివృద్ది చేయడం జరుగుతుందని వెల్లడించారు. పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మెడికల్ కాలేజీలు మంజూరు అవుతాయన్నారు. రైతులు, చేనేత కార్మికులు, చిరు వ్యాపారస్తులకు ప్రభుత్వం అండగా ఉందన్నారు.
భోగాపురం ఎయిర్ పోర్ట్ ను మరింత వేగవంతం చేసేందుకు కేంద్రంతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు గవర్నర్.
ఎంఎస్ఎంఈలకు రూ. 2, 363.2 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందించామని చెప్పారు. పారిశ్రామిక నైపుణ్యం కోసం రెండు యూనివర్శిటీలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
Also Read : మభ్య పెట్టేందుకు దేశం సభ్యులు సభకొస్తున్నారు