BJP MLA’s Suspension : బీజేపీ ఎమ్మెల్యేల స‌స్పెన్ష‌న్

స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు

BJP MLA’s Suspension : అంతా ఊహించిన‌ట్లు గానే తెలంగాణ ప్ర‌భుత్వం భార‌తీయ జ‌న‌తా పార్టీపై ఒక ర‌కంగా క‌క్ష తీర్చుకుంద‌నే చెప్ప‌క త‌ప్ప‌దు. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల ఆలోచ‌న‌ల‌కు భిన్నంగా స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకున్నారు.

అసెంబ్లీ నుంచి మాజీ మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్, ర‌ఘునంద‌న్ రావు, రాజా సింగ్ (ఆర్ఆర్ఆర్) ల‌ను స‌భ నుంచి స‌స్పెండ్ (BJP MLA’s Suspension)చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. బ‌డ్జెట్ ప్ర‌సంగానికి అడ్డు త‌గులుతున్నార‌నే నెపంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

దీనిపై ప్ర‌జాస్వామిక వాదులు, మేధావులు, విప‌క్షాలు సైతం తీవ్ర స్థాయిలో అభ్యంత‌రం తెలిపారు. ఒకటి లేదా రెండు రోజులు స‌స్పెన్ష‌న్ విధిస్తారు కానీ స‌మావేశాలు పూర్త‌య్యేంత దాకా వారిపై వేటు వేయ‌డం ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మైన (BJP MLA’s Suspension)చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు.

స్పీక‌ర్ నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ ప్ర‌భుత్వంపై మండి ప‌డుతూ అసెంబ్లీ గేటు వ‌ద్ద ఈట‌ల రాజేంద‌ర్, ర‌ఘునంద‌న్ రావు, రాజా సింగ్ ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ స‌స్పెన్ష‌న్ వ్య‌వ‌హారం తీవ్ర క‌ల‌క‌లం రేపింది.

అసెంబ్లీ స‌మావేశాల ప్రారంభం కంటే ముందు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు గ‌న్ పార్క్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. అక్క‌డ ఉన్న అమ‌ర వీరుల స్థూపానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తామ‌ని సీఎం కేసీఆర్ నియంతృత్వ ధోర‌ణిని ఎండ గ‌డ‌తామంటూ హెచ్చ‌రించారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న స్పీక‌ర్ ఉన్న‌ట్టుండి ఈ వేటు వేయ‌డం విస్తు పోయేలా చేసింది. ఇది బీజేపీకి ఊహించని దెబ్బ‌గా భావించ‌క త‌ప్ప‌దు.

Also Read : రూ. 2.56 ల‌క్ష‌ల కోట్ల‌తో తెలంగాణ బ‌డ్జెట్

Leave A Reply

Your Email Id will not be published!