China : ఉక్రెయిన్ పై ఏకపక్ష దాడులను ఆపాలని, వెంటనే యుద్దాన్ని నిలిపి వేయాలని యావత్ ప్రపంచం కోరుతోంది. కానీ రష్యా ససేమిరా అంటోంది. ఈ తరుణంలో అన్ని దేశాలు ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి.
కానీ రష్యా ముందుకే కదులుతోంది. అయితే చైనా (China ) మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తమకు రష్యా అత్యంత మిత్ర దేశమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ ధ్రువీకరించారు.
మీడియాతో మాట్లాడుతూ మాస్కో, బీజింగ్ మధ్య అద్బుతమైన సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఉక్రెయిన్, రష్యాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు అవసరమైతే తాము రంగంలోకి దిగేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.
ఇదిలా ఉండగా ఇప్పుడున్న ఉద్రిక్త పరిస్థితుల్లో చైనా చేసిన ఈ ప్రకటన మరింత ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది. ఒకవేళ అవసరమని అనుకుంటే సంధి కుదిర్చేందుకు తాము రెడీ అని డిక్లేర్ చేశారు.
ప్రపంచ దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుండాలని తాము కోరుకుంటున్నామని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
బ్రిటన్ , ఫ్రాన్స్ , తదితర దేశాలన్నీ భారత్, చైనా(China ) దేశాలు రష్యాతో చర్చలు జరపాలని యుద్దం నుంచి ఉక్రెయిన్ ను కాపాడాలని కోరాయి. ఇప్పటికే ఈ రెండు దేశాలు తటస్థంగా ఉన్నాయి.
రష్యా భారత్ పట్ల మెతక వైఖరిని ప్రదర్శిస్తోంది. ఏ మాత్రం తేడా వచ్చినా రష్యా తో సంబంధాలు తెగి పోయే ప్రమాదం ఉంది.
Also Read : తల వంచేంత దాకా యుద్దమే