Dmytro Kuleba : ఉక్రెయిన్ పై రష్యా తన ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తోంది. పూర్తిగా ఏకపక్షంగా సాగుతుందని, రెండు మూడు రోజుల్లోనే ఉక్రెయిన్ తన చేతుల్లోకి వస్తుందని రష్యా ఆశించింది.
కానీ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆశలపై నీళ్లు చల్లారు ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీ. తానే ముందుండి సాయుధ దళాలను నడిపించాడు. ఇప్పటికీ ఆ దేశ రాజధాని కీవ్ అతడి చేతుల్లోనే ఉంది.
రష్యా ప్రధాన నగరాలను ఒక్కొక్కటినీ స్వాధీనం చేసుకుంటూ పోతోంది. ఈ తరుణంలో ఓ వైపు ఫ్రాన్స్ , బ్రిటన్, అమెరికా తదితర దేశాలన్నీ భారత్, చైనాలను వేడుకుంటున్నాయి.
ఎలాగైనా సరే జోక్యం చేసుకుని యుద్దాన్ని ఆపాలని కోరాయి. అంతే కాకుండా ప్రపంచ వాటికన్ సిటీ క్యాథలిక్ చర్జి పోప్ ఫ్రాన్సిస్ సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
తాను అవసరమైతే మాస్కోకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. ఇదిలా ఉండగా రష్యా దాడులలో అమాయకులు, సాధారణ పౌరులు, చిన్నారులు, వృద్ధులు, మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారని వారిని చూసి తట్టుకోలేక పోతున్నానని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా(Dmytro Kuleba) వాపోయాడు.
ఈ గడ్డు పరిస్థితిని అడ్డుకోవాలంటే తమ దేశాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించడం ఒక్కటే తమ ముందున్న మార్గమని స్పష్టం చేశాడు. యుద్దాన్ని ఆపేందుకు ఏదో ఒకటి చేయాలంటూ విన్నవించాడు. ప్రస్తుతం కులేబా చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
కాగా ఉక్రెయిన్ చేసిన ప్రతిపాదనపై యూరోపియన్ యూనియన్ విచిత్రంగా స్పందించింది. నో ఫ్లై జోన్ గా ప్రకటిస్తే అది మూడో ప్రపంచ యుద్దానికి దారి తీస్తుందని హెచ్చరించింది.
Also Read : మరోసారి రష్యా కాల్పుల విరమణ