AP Cabinet : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏపీ రాష్ట్రంలో ఉర్దూ భాషను రెండో భాషగా గుర్తిస్తూ ఏపీ మంత్రివర్గం తీర్మానం చేసింది.
ఇవాళ ఆ రాష్ట్ర సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి (AP Cabinet)అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఇటీవల హఠాన్మారణం చెందిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ నివాళులు అర్పించారు.
అనంతరం కీలక అంశాలపై చర్చ జరిగింది. ఈ మేరకు ఏపీ అధికార భాష చట్టం 1966 కింద సవరణ చేస్తూ ఉర్దూను రెండో భాషగా అమలు చేయాలన్న నిర్ణయానికి ఓకే చెప్పింది.
అంతే కాకుండా విదేశీ మద్యం నియంత్రణ చట్టానికి కూడా సవరణ చేసింది. మరో వైపు నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఓడ రేవుల నిర్మాణానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
దీంతో పాటు ధార్మిక సంస్థల చట్ట సవరణకు ఓకే చెప్పింది. ఇటీవల తీవ్ర విమర్శలకు గురైన , హైకోర్టులో కేసు నమోదు అయిన వివాదాస్పద అంశం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై కూడా చర్చ జరిగింది.
రూ. 8 వేల 741 కోట్ల రుణ సమీకరణ, ఏపీ మారిటైం బోర్డుకు హామీ ఉండేందుకు కూడా ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఇంకో వైపు ఖాయిలా పడిన చక్కెర కర్మా గారాల్లోని ఉద్యోగులకు వీఆర్ఎస్ విరమణకు , మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులకు రూ. 214 కోట్ల ఖర్చుకు సైతం క్యాబినెట్ ఓకే చెప్పింది.
Also Read : జగన్ పాలన జనరంజకం