Modi Putin : ఉక్రెయిన్ పై ఏకపక్ష దాడులతో విరుచుకు పడుతూ మారణ హోమానికి కారణమవుతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Modi Putin )ఫోన్ లో ఇవాళ మాట్లాడారు.
ఈ సందర్భంగా ప్రధానంగా యుద్దం, దాని పర్యవసానం గురించి ప్రస్తావించారు. వెంటనే ఇరు దేశాలు ఇతర దేశాలు, సంస్థలతో ప్రమేయం లేకుండా చర్చించు కోవాలని సూచించారు.
పెద్ద ఎత్తున సాధారణ పౌరులు, చిన్నారులు, మహిళలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు మోదీ. ఇప్పటికే భారత దేశానికి చెందిన 20 వేల మంది విద్యార్థులు అక్కడే చిక్కుకు పోయారు.
ఈ తరుణంలో కేంద్రం తీవ్రంగా ప్రయత్నాలు చేసి చాలా మటుకు వారిని స్వదేశానికి తీసుకు వచ్చే ప్రయత్నం చేసింది. కేంద్ర మంత్రులు అక్కడి రాయబార కార్యాలయంలోనే తిష్ట వేశారు.
రష్యా దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. చర్చల్లో భాగంగా ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపుపైనే ఎక్కువగా ప్రస్తావించినట్లు సమాచారం.
ఇదే సమయంలో ఉక్రెయిన్ – రష్యా మధ్య జరుగుతున్న చర్చల గురించి కూడా పుతిన్ మోదీకి వివరించే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారుల మధ్య కాకుండా మీరు, ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీ కలిసి చర్చించు కోవాలంటూ ప్రధాని మోదీ ప్రత్యేకంగా పుతిన్ కు సూచించడం విశేషం.
ఇందుకు పుతిన్ కూడా అంగీకరించినట్లు భారత పీఎంఓ కార్యాలయం వెల్లడించింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, ఇతర దేశాలను కాదని రష్యా ఎక్కువగా చైనాతో పాటు భారత్ కు ప్రయారిటీ ఇస్తూ వస్తోంది. ఇరు దేశాలతో రష్యాకు మంచి సంబంధాలు ఉన్నాయి.
Also Read : రష్యా ఏకపక్ష దాడుల్ని ఆపండి ప్లీజ్