Assembly Election 2022 : ఎగ్జిట్ పోల్స్ లో క‌మ‌లం హ‌వా

రెండు చోట్ల కాంగ్రెస్ ముందంజ‌

Assembly Election 2022 : ఇవాల్టితో దేశంలోని ఐదు రాష్ట్రాల‌లో పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం విధించిన నిషేధం పూర్తి కావ‌డంతో ఆయా స‌ర్వే సంస్థ‌లు, ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సార మాధ్య‌మాలు త‌మ స‌ర్వేల పేరుతో హోరెత్తిస్తున్నాయి.

అన్ని మాధ్య‌మాలు బీజేపీ, ఆప్ మొగ్గు చూపుతుండ‌గా జీ గ్రూప్ మాత్రం కాంగ్రెస్ కు ఛాన్స్ ఉంద‌ని పేర్కొన‌డం విశేషం. జీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్(Assembly Election 2022) ప్ర‌కారం ఉత్త‌రాఖండ్ లో కాంగ్రెస్ పాగా వేస్తోంద‌ని గోవాలో కీల‌కంగా మార‌నుంద‌ని తెలిపింది.

ఉత్త‌రాఖండ్ లో 70 స్థానాల‌కు గాను కాంగ్రెస్ కు 35 నుంచి 40 వ‌స్తాయ‌ని బీజేపీకి 26 నుంచి 30, బీఎస్పీకి 2 నుంచి 3 వ‌స్తాయ‌ని ప్ర‌క‌టించింది.

ఇక గోవాలో మొత్తం 40 స్థానాల‌కు గాను కాంగ్రెస్ కు 14 నుంచి 19 సీట్లు వ‌స్తాయ‌ని ముందు వ‌రుస‌లో ఉంటుంద‌ని తెలిపింది. బీజేపీ 13 నుంచి 18 దాకా రానున్నాయ‌ని పేర్కొంది.

ఎంజీపీ, మిత్ర‌ప‌క్షాలు క‌లిపి 2 నుంచి 5 సీట్లు గెలుచు కోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది. ఇత‌రులు 3 చోట్ల విజ‌యం సాధిస్తార‌ని తెలిపింది.

ఇక మ‌ణిపూర్ లో 60 సీట్ల‌కు గాను బీజేపీకి 32 నుంచి 38, కాంగ్రెస్ 12 నుంచి 17 , ఎన్ పీఎఫ్ 3 నుంచి 5, ఎన్ పీపీ 2 నుంచి 4 , ఇత‌రులు 5 సీట్ల‌లో గెలిచే ఛాన్స్ ఉంద‌ని వెల్ల‌డించింది.

ఇక పంజాబ్ లో 117 సీట్ల‌కు గాను ఆప్ 52 నుంచి 61 సీట్లు , కాంగ్రెస్ 26 నుంచి 33 సీట్లు , సాద్ కూట‌మి 24 నుంచి 32 స‌ట్లు, బీజేపీ మిత్ర పక్షాలు 3 నుంచి 7 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయ‌ని తెలిపింది.

Also Read : ముగిసిన ఎన్నిక‌ల ప‌ర్వం

Leave A Reply

Your Email Id will not be published!