Bodige Shobha : ధిక్కార స్వ‌రం ‘శోభ‌’క్క ప్ర‌స్థానం

ప్ర‌జా ప్ర‌స్థానంలో త‌ల‌వంచ‌ని నేత

Bodige Shobha  : తెలంగాణ రాజ‌కీయాల‌లో బొడిగె శోభ(Bodige Shobha )పేరు తెలియ‌ని వారంటూ ఉండ‌రు. నిక్క‌చ్చిగా..సూటిగా తెలంగాణ యాస‌, భాష‌లో దుమ్ము రేపి ప్ర‌శ్నించే నాయ‌కురాలిగా పేరొందారు.

ప్ర‌స్తుతం భార‌తీయ జ‌న‌తా పార్టీలో కొన‌సాగుతున్నారు. అంతకు ముందు చొప్ప‌దండి ఎమ్మెల్యేగా ఉన్నారు. అధికార పార్టీపై నిప్పులు చెరుగుతూ ప్ర‌జా గొంతుక‌ను వినిపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

1974 జూన్ 9న క‌రీంన‌గ‌ర్ జిల్లా ఎల్క‌తుర్తి మండ‌లం దామెర గ్రామంలో పుట్టారు. ఇంట‌ర్ మ‌ధ్య‌లోనే ఆపేసింది. 16 ఏళ్ల వ‌య‌సులో గాల‌న్న‌తో పెళ్లి జ‌రిగింది. బొడిగె శోభ 1990లో రాజ‌కీయాల్లోకి ఎంట‌ర్ అయ్యారు.

ఆమె మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి మ‌హిళా విభాగం నాయ‌కురిగా ప‌ని చేశారు. 1999లో ఉమ్మ‌డి ఏపీలో మ‌హాజ‌న ఫ్రంట్ నుంచి క‌మ‌లాపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడి పోయారు.

తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొంది. 2001లో టీఆర్ఎస్ లో చేరింది. శంక‌ర‌ప‌ట్నం జెడ్పీటీసీగా పోటీ చేసి విజ‌యం సాధించింది. 2009 నుంచి టీఆర్ఎస్ పార్టీ ఇన్ చార్జీగా ఉన్నారు.

2014లో చొప్ప‌దండి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా కాంగ్రెస్ పార్టీ కి చెందిన సుద్దాల దేవ‌య్య‌పై 54 వేల 981 ఓట్ల భారీ మెజారిటీ సాధించి ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది.

ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా నుంచి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగు పెట్టిన తొలి ద‌ళిత మ‌హిళా ఎమ్మెల్యేగా చ‌రిత్ర సృష్టించింది. 2018లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆమెకు టికెట్ రాక పోవ‌డంతో అదే ఏడాది న‌వంబ‌ర్ 15న బీజేపీలో చేరింది.

ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడి పోయింది. అయినా త‌న పోరాటాన్ని మాత్రం ఆమె ఆప‌డం లేదు. ప్ర‌జ‌ల త‌రపున ఉంటూ త‌న గొంతును వారి కోసం వినిపిస్తోంది. ప్ర‌త్యేకంగా కేసీఆర్ ను, టీఆర్ఎస్ చేస్తున్న ఆగ‌డాల‌ను ఎత్తి చూపుతూ దుమ్ము రేపుతోంది.

Also Read : రైతు పోరాటం మ‌హిళ‌లు కీల‌కం

Leave A Reply

Your Email Id will not be published!