Zelensky : పోరాటం ఆపం విజ‌యం త‌థ్యం

స్ప‌ష్టం చేసిన ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీ

Zelensky : ఉక్రెయిన్ పై ఏక‌ప‌క్ష దాడుల‌కు పాల్ప‌డుతోంది ర‌ష్యా. ఓ వైపు యావ‌త్ ప్ర‌పంచం మొత్తుకున్నా వార్ ఆప‌డం లేదు. ఇంకా దాడుల‌ను ముమ్మ‌రం చేస్తోంది. ఇంకో వైపు ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీ(Zelensky) పారి పోయాడంటూ ప్ర‌చారానికి తెర తీసింది ర‌ష్యా.

దీనిని ప‌టా పంచ‌లు చేస్తూ ద‌మ్ముంటే నువ్వొక్క‌డివే రా అంటూ ర‌ష్యా చీఫ్ వ్లాదిమిర్ పుతిన్ కు స‌వాల్ విసిరాడు జెలెన్ స్కీ. తాను ఎక్క‌డికీ పారి పోలేద‌న్నాడు. ఇక్క‌డే ఉక్రెయిన్ రాజ‌ధానిలోని కీవ్ కార్యాల‌యంలోనే సేద దీరుతున్నాన‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ మేర‌కు సెల్ఫీ వీడియోను సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేశాడు. ప్ర‌స్తుతం ఇది హ‌ల్ చ‌ల్ అవుతోంది. ఇక ఇజ్రాయిల్ , వాటిక‌న్ సిటీ పోప్ ఫ్రాన్సిస్ , ఫ్రాన్స్ , ట‌ర్కీ, చైనా, ఇండియా దేశాల అధ్యక్షులు యుద్దాన్ని ఆపాల‌ని కోరుతున్నాయి.

నిన్న ఉన్న‌ట్టుండి తాత్కాలిక విరామం ప్ర‌క‌టించాడు పుతిన్. కొంత ఊపిరి పీల్చుకున్న‌ప్ప‌టికీ ఇవాళ మ‌రోసారి దాడుల‌ను స్టార్ చేశాడు. దీంతో ఉక్రెయిన్ పై శ‌ర‌ప‌రంగా బాంబులు, మిస్సైళ్లు వ‌చ్చి ప‌డుతున్నాయి.

అయితే ర‌ష్యా దాడులు చేప‌ట్టి ఇవాళ 13 వ‌రోజుకు చేరింది. త‌మ దేశం దారుణంగా నాశ‌న‌మైనా తాము మాత్రం అంతిమ క్ష‌ణం దాకా పోరాటం సాగిస్తామ‌ని ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీ ప్ర‌క‌టించాడు.

పోరాటాన్ని ఆపేది లేద‌ని విజ‌యం సాధించేంత దాకా విశ్ర‌మించ‌మ‌ని స్ప‌ష్టం చేశాడు. ఆయ‌న ఇచ్చిన వీడియో సందేశం ఇప్పుడు కోట్లాది మందిని ప్ర‌భావితం చేస్తోంది. పుతిన్ రాక్ష‌సుడిగా మారి పోతే జెలెన్ స్కీ మాత్రం హీరోగా మారాడు.

Also Read : క‌ల‌హాలు వ‌ద్దు క‌లిసుందాం 

Leave A Reply

Your Email Id will not be published!