Sanjay Raut : ఐటీ దాడుల‌పై రౌత్ క‌న్నెర్ర‌

మ‌రాఠాలో 12 చోట్ల దాడులు

Sanjay Raut : కేంద్ర స‌ర్కార్ మ‌రాఠా ప్ర‌భుత్వం మ‌ధ్య మ‌రింత దూరం పెరుగుతోంది. ఇప్ప‌టికే ఈడీని ప్ర‌యోగించిన కేంద్రం తాజాగా మ‌హారాష్ట్ర‌లోని 12 చోట్ల ఐటీ దాడులు చేసేలా చేయ‌డంపై శివ‌సేన సీరియ‌స్ అవుతోంది.

ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థ‌ల‌న్నీ మోదీ స‌ర్కార్ క‌నుస‌న్న‌ల‌లో న‌డుస్తున్నాయంటూ మండిప‌డ్డారు శివ‌సేన పార్టీ అధికార ప్ర‌తినిధి, ఎంపీ సంజ‌య్ రౌత్(Sanjay Raut). ఇవాళ ఆక‌స్మికంగా ముంబై, పూణేల‌తో స‌హా మ‌రికొన్ని ప్రాంతాల‌లో ఐటీ దాడుల‌కు పాల్ప‌డింది.

బాంద్రా ప్రాంతంల లోని రాహుల్ క‌నాల్ , కండివాలి లోని ఎమ్మెల్యే స‌దానంద తో పాటు పూణె లోని బ‌జ‌రంగ్ క‌ర్మాటే ఇళ్ల‌ల్లో ఐటీ దాడులు కొన‌సాగుతున్నాయి.

విచిత్రం ఏమిటంటే రాహుల్ క‌నాల్ ప్ర‌స్తుత కేబినెట్ మంత్రి ఆదిత్య థాక‌రేకు అత్యంత స‌న్నిహితుడిగా ఉండ‌డం విశేషం. మిగ‌తా ఇద్ద‌రు ఎమ్మెల్యేలు కూడా మ‌రో మంత్రి కి స‌న్నిహితులుగా పేరొందారు.

శివ‌సేన నాయ‌కుడు, బీఎంసీ ఉప నేత య‌శ్వంత్ జాద‌వ్ , స‌న్నిహితుడు బిమ‌ల్ అగ్ర‌వాల్ , బిపిన్ జైన్ తో స‌హా న‌గ‌రంలోని ప్ర‌ముఖుల‌పై దాడులు కొన‌సాగుతున్నాయి.

దీనిపై శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. మ‌హారాష్ట్ర‌, బెంగాల్ రాష్ట్రాలే టార్గెట్ గా కేంద్రం య‌త్నిస్తోందంటూ ధ్వ‌జమెత్తారు.

ఈ రెండు పార్టీల‌నే ఎందుకు ల‌క్ష్యంగా చేసుకున్నారంటూ ఫైర్ అయ్యారు. దేశంలో ఎక్కువ‌గా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌న్నీ త‌మ రాష్ట్రంలోనే జ‌రిగియాని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

త‌మపై దాడుల‌కు పాల్ప‌డుతున్న ఈ సంస్థ‌లు బీజేపీ నేత‌ల‌పై ఎందుకు దాడుల‌కు పాల్ప‌డ‌డం లేదంటూ ప్ర‌శ్నించారు సంజ‌య్ రౌత్.

Also Read : ఎగ్జిట్ పోల్స్ లో క‌మ‌లం హ‌వా

Leave A Reply

Your Email Id will not be published!