Panneer Selvam : తమిళనాడులో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఆ రాష్ట్ర మాజీ దివంగత సీఎం జయలలిత మరణంపై ఇంకా అనుమానాలు తొలగి పోలేదు. చని పోయి ఇన్నేళ్లయినా రాజకీయం ఆమె చుట్టూ తిరుగుతూ ఉంది.
ఈ తరుణంలో తాజాగా ఆర్ముగస్వామి కమిషన్ కోలుకోలేని షాక్ ఇచ్చింది పన్నీరు సెల్వంతో పాటు వీకే శశికళ వదిన ఇలవరిసికి . ప్రస్తుతం పన్నీరు సెల్వం అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ గా ఉన్నారు.
ఇక శశికళ అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలిగా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. పవర్ కోల్పోయిన అన్నాడీఎంకే (Panneer Selvam)ను తన ఆధీనంలోకి తీసుకోవాలని చిన్నమ్మ శతవిధాలుగా యత్నిస్తోంది.
ఈ తరుణంలో ఆర్ముగ స్వామి కమిషన్ సమన్లు జారీ చేయడంతో బిగ్ షాక్ తగిలినట్లయింది. దివంగత జయలలిత నివాసంలో ఎక్కువ కాలం చిన్నమ్మతో పాటు ఆమె వదిన కూడా ఉన్నారు.
మాజీ సీఎం మరణంపై నెలకొన్న మిస్టరీని ఛేదించేందుకు మళ్లీ రంగంలోకి దిగింది ఆర్ముగస్వామి కమిషన్. అంతకు ముందు ఆమెకు చికిత్స చేసిన అపోలోకు కూడా కమిషన్ సమన్లు జారీ చేయడం కలకలం రేపింది.
వైద్యులు కమిషన్ ముందు హాజరై ఆమె గుండె పోటుతోనే మరణించిందంటూ వెల్లడించారు. గతంలోనే విచారణకు రావాలని ఆదేశించినా పన్నీరు సెల్వం హాజరు కాక పోవడంతో తిరిగి సమన్లు జారీ చేసింది కమిషన్.
ఈనెల 21న హాజరు కావాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా శశికళ వదిన ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆమె కూడా రావాలని స్పష్టం చేసింది కమిషన్.
Also Read : ఇంధన ధరలపై మంత్రి కామెంట్స్